Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ సుంకాలు, మాంద్యం భయాలు.. 5 నిమిషాల్లో రూ.19 లక్షల కోట్లు నష్టపోయిన స్టాక్ మార్కెట్

అమెరికా విధించిన సుంకాల ప్రభావం భారత మార్కెట్‌పై తీవ్రంగా కనిపిస్తోంది. సోమవారం(ఏప్రిల్ 7), భారత స్టాక్ మార్కెట్ 3939 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా 1,160 పాయింట్లకు పైగా క్షీణించింది. ప్రతిచోటా భారీ క్షీణత నమోదు చేసుకుంది. అన్ని రంగాలు భారీగా పెద్ద తిన్నాయి. స్టాక్ మార్కెట్ దాదాపు 6 శాతం క్షీణతను నమోదు చేసింది. ఒక్క రోజులోనే పెట్టుబడిదారులు రూ.31 లక్షల కోట్లు నష్టపోయారు.

ట్రంప్ సుంకాలు, మాంద్యం భయాలు.. 5 నిమిషాల్లో రూ.19 లక్షల కోట్లు నష్టపోయిన స్టాక్ మార్కెట్
Share Market
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 07, 2025 | 5:51 PM

అమెరికా- చైనా మధ్య సుంకాల యుద్ధం, ఆర్థిక మాంద్యం భయం స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను కదిలించాయి. సోమవారం(ఏప్రిల్ 7), స్టాక్ మార్కెట్ దాదాపు 5 శాతం క్షీణతను చవిచూసింది. దీనివల్ల పెట్టుబడిదారులు రూ.20 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. సెన్సెక్స్ 3,939.68 పాయింట్లు క్షీణించింది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 1,160 పాయింట్లకు పైగా క్షీణించింది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున సంభవించిన క్షీణత తర్వాత ఈ క్షీణతను అతిపెద్ద క్షీణతగా పరిగణిస్తున్నారు ఆర్థిక నిపుణులు. స్టాక్ మార్కెట్ దాదాపు 6 శాతం క్షీణతను నమోదు చేసింది. ఒక్క రోజులోనే పెట్టుబడిదారులు రూ.31 లక్షల కోట్లు నష్టపోయారు.

అయితే, గత 3 దశాబ్దాలకు పైగా, స్టాక్ మార్కెట్లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో పెద్ద క్షీణత కనిపించింది. 1992లో హర్షద్ మెహతా కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు, ఒకే రోజులో దాదాపు 13 శాతం తగ్గుదల కనిపించింది. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ఎవరు మర్చిపోగలరు? 2015 – 2016లో పతనం తర్వాత, స్టాక్ మార్కెట్ కొంతవరకు కోలుకుంది. కానీ కోవిడ్ స్టాక్ మార్కెట్‌ను మింగేసింది. మార్చి 23న, స్టాక్ మార్కెట్ ఒకే రోజులో 13 శాతానికి పైగా పడిపోయింది. 1992 నుండి 2024 వరకు, ఏ సందర్భంలో స్టాక్ మార్కెట్లో ఒక రోజులో అతిపెద్ద క్షీణత కనిపించింది. పెట్టుబడిదారులు ఎంత నష్టాన్ని చవిచూశారో తెలుసుకుందాం.

హర్షద్ మెహతా కుంభకోణం

ఏప్రిల్ 1992 లో హర్షద్ మెహతా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీని కారణంగా ఏప్రిల్ 29న 570 పాయింట్లు అంటే 12.77% సెన్సెక్స్ క్షీణత నమోదు చేసింది. హర్షద్ మెహతా, బిగ్ బుల్, బ్యాంకుల నుండి రూ. 1,000 కోట్లు అపహరించడం ద్వారా స్టాక్ మార్కెట్‌ను తన ఆటబొమ్మగా చేసుకున్నాడు. ఈ కుంభకోణం బయటపడినప్పుడు, ప్రజల్లో భయాందోళనలు వ్యాపించాయి. దీని ప్రభావంతో 1990లలో పెట్టుబడిదారుల రూ.4,000 కోట్ల డబ్బు మాయమైంది. ఈ గందరగోళాన్ని తొలగించడానికి సెబీ పుట్టింది.

2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం

జనవరి 2008 నుండి మార్చి 2009 వరకు ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. దీని కారణంగా 61.5% తగ్గుదల (21,206 నుండి 8,160) సెన్సెక్స్ పతనం చవిచూసింది. జనవరి 21, 2008న 1,408 పాయింట్లు (7.4%) నష్టపోయింది. అమెరికాలో లెమాన్ బ్రదర్స్ కుప్పకూలింది. అది అందరినీ కదిలించింది. FIIలు భారతదేశం నుండి చాలా వేగంగా నగదును ఉపసంహరించుకున్నారు. ఆ పరిస్థితులు ఆర్థిక మాంద్యంకు దారి తీశాయి. ఆ సమయంలో ట్రిలియన్ల డాలర్లు ఆవిరయ్యాయి. కానీ భారతదేశ బ్యాంకులు బలంగా ఉన్నాయి. 2010 నాటికి, సెన్సెక్స్ తిరిగి పుంజుకుంది.

US షేర్ మార్కెట్ క్రాష్

చైనాలో 2015 భయాందోళనలు కారణంగా ఆగస్టు 24, 2015 షేర్ మార్కెట్ క్రాష్ అయ్యింది. సెన్సెక్స్ 1,624 పాయింట్లు (5.94%) క్షీణత నమోదు చేసుకుంది. చైనా యువాన్ పతనం, ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు. బ్రెక్సిట్ భయాందోళనలు, చౌకైన చమురును ఆర్థికంగా దెబ్బతీశాయి. భారతదేశం కూడా ఈ క్షీణతలో చిక్కుకుంది. దాని కారణంగా ఒక్క రోజులోనే 7 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాయి. ఇది ఒక హెచ్చరిక. రెండు వైపులా ప్రపంచ సంబంధాలు దెబ్బతిన్నాయి.

2016 డీమానిటైజేషన్

2016 డీమానిటైజేషన్ నవంబర్ 9, 2016న జరిగింది. దీంతో 1,689 పాయింట్లు (6.12%) సెన్సెక్స్ క్షీణించింది. నిఫ్టీ 541.3 పాయింట్లు (6.33 శాతం) నష్టపోయింది. దేశ ప్రధాని మోదీ రాత్రికి రాత్రే 500, 1,000 రూపాయల నోట్లను నిషేధించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. మార్కెట్లో గందరగోళం నెలకొంది. రూపాయి విలువ పడిపోయింది. ఆ ప్రభావంతో మార్కెట్ క్యాప్ రూ. 3-4 లక్షల కోట్లు తగ్గింది. నగదు, రియాలిటీ వంటి భారీ రంగాలు దెబ్బతిన్నాయి.

2020 కోవిడ్ మహమ్మారి ఎఫెక్ట్

2020లో కోవిడ్ మహమ్మారి ప్రమాదం కారణంగా మార్చి 23న సెన్సెక్స్ 3,935 పాయింట్లు (13.15%) పతనం నమోదు చేసుకుంది. ఇది భారతదేశంలో ఒకే రోజులో అతిపెద్ద పతనం. నిఫ్టీ క్షీణత: 1,135 పాయింట్లు (13%). 2020లో లాక్‌డౌన్ ప్రపంచాన్ని కుదిపేసింది. భారతదేశంలో షట్డౌన్ ప్రకటన ప్రజలలో భయాందోళనలను సృష్టించింది. దీని కారణంగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. మార్చి 23న జరిగిన ఈ పెద్ద పతనం కారణంగా, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఒకే రోజులో రూ.14.22 లక్షల కోట్లు నష్టపోయారు.

2024-2025 లోక్‌సభ ఎన్నికలు

జూన్ 2024 సెప్టెంబర్ నెలలో సెన్సెక్స్ -5.22% (4,389 పాయింట్లు); నిఫ్టీ -6.10% (1,419.4 పాయింట్లు) నష్టపోయాయి. జూన్ 4న స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం బీజేపీ మెజారిటీ సీట్లకు దూరంగా ఉండటం. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ మద్దతు గల ఎన్డీఏకు 400 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో 8 నుండి 9 శాతం క్షీణతను చూసింది. మార్కెట్ ముగిసిన తర్వాత కూడా, సెన్సెక్స్, నిఫ్టీ 5 నుండి 6 శాతం క్షీణతతో ముగిశాయి. దీనివల్ల మార్కెట్ పెట్టుబడిదారులు రూ.31 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..