ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్.. కీలక సూచనలు చేసిన సర్కార్
కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు, విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘాను మరింత పెంచడంతో పాటు సాధారణ జనాల కోసం కూడా మరికొన్ని స్ట్రిక్ట్ రూల్స్ సిద్దం చేసింది. ప్రజలు ఇష్టమొచ్చినట్టు రోడ్డుమీదకు వస్తోన్న నేపథ్యంలో కట్టడి చర్యలకు సిద్దమైంది. ముఖ్యంగా సిటీలు, అర్బన్ ఏరియాల్లోని ప్రజలు నిబంధనలు పెడచెవిన పెడుతోన్న నేపథ్యంలో…ఆయా ప్రాంతాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 వరకే అనుమతిస్తున్నట్లు డిప్యూటీ సీఎం […]

కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు, విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘాను మరింత పెంచడంతో పాటు సాధారణ జనాల కోసం కూడా మరికొన్ని స్ట్రిక్ట్ రూల్స్ సిద్దం చేసింది. ప్రజలు ఇష్టమొచ్చినట్టు రోడ్డుమీదకు వస్తోన్న నేపథ్యంలో కట్టడి చర్యలకు సిద్దమైంది. ముఖ్యంగా సిటీలు, అర్బన్ ఏరియాల్లోని ప్రజలు నిబంధనలు పెడచెవిన పెడుతోన్న నేపథ్యంలో…ఆయా ప్రాంతాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 వరకే అనుమతిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రజలకు మరికొన్ని సూచనలు చేశారు.
నిపుణుల సలహాల మేరకు నిత్యవాసరల కోసం కేటాయించిన సమయాన్ని తగ్గించినట్లు తెలియజేశారు. ఉదయం 11 గంటల తర్వాత బయటకు వస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట వరకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఇక షాపుల్లో, సూపర్ మార్కెట్లలో సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని స్ఫష్టం చేశారు. ధరల పట్టిక ప్రతి షాపులోనూ పొందుపరచాలని చెప్పారు. వీటికి సంబంధించి ఫిర్యాదుల కోసం ఓ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. పంటల ధరలు పడిపోకుండా..మొబైల్ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. పొరుగు రాష్ట్రల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని, సరిహద్దుల్లో చిక్కుకున్నవారికి కూడా ఆదుకుంటామని తెలిపారు.