లాక్‌డౌన్ పాటించనివారి కోసం.. పూరి మార్క్ ఐడియా

డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్..కొన్ని ఇంట‌ర్వ్యూలలో భార‌తదేశంలోని కొంత‌మంది ప్ర‌జ‌లు గురించి చెప్పిన మాటలు నిజ‌మేనేమో అనిపింస్తుంది. ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారి డెవ‌ల‌ప్పుడ్ కంట్రీస్ లో కూడా వేల సంఖ్య‌లో ప్రాణాల‌ను లాగేసుకుపోతుంటే..మ‌న‌వాళ్లు కొంద‌రు మినిమ‌మ్ కామ‌న్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. అదేదో పిక్ నిక్ కి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు గుంపులు, గుంపులుగా రోడ్ల‌పై తిరుగుతున్నారు. దేశ‌మంతా లాక్‌డౌన్ పెట్టి పీఎం, సీఎం లు చేతుల‌కు జోడించి చెబుతోన్న కొందరు అతిగాళ్ల‌కు నెత్తికెక్క‌డం […]

లాక్‌డౌన్ పాటించనివారి కోసం.. పూరి మార్క్ ఐడియా
Follow us

|

Updated on: Mar 29, 2020 | 3:19 PM

డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్..కొన్ని ఇంట‌ర్వ్యూలలో భార‌తదేశంలోని కొంత‌మంది ప్ర‌జ‌లు గురించి చెప్పిన మాటలు నిజ‌మేనేమో అనిపింస్తుంది. ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారి డెవ‌ల‌ప్పుడ్ కంట్రీస్ లో కూడా వేల సంఖ్య‌లో ప్రాణాల‌ను లాగేసుకుపోతుంటే..మ‌న‌వాళ్లు కొంద‌రు మినిమ‌మ్ కామ‌న్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. అదేదో పిక్ నిక్ కి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు గుంపులు, గుంపులుగా రోడ్ల‌పై తిరుగుతున్నారు. దేశ‌మంతా లాక్‌డౌన్ పెట్టి పీఎం, సీఎం లు చేతుల‌కు జోడించి చెబుతోన్న కొందరు అతిగాళ్ల‌కు నెత్తికెక్క‌డం లేదు.

పోలీసులు జోతులు జోడించినా, లాఠీలు ఝులిపించినా ఫ‌లితం ఉండ‌టం లేదు. గ‌తంలో ఇంట్లో ఉండ‌లేని వాళ్లు ఆముదం తాగితే..మోష‌న్స్ అవుతాయ‌ని..అప్పుడు ఇంట్లోనే ఉండొచ్చ‌ని ఐడియా ఇచ్చిన పూరి..ఈసారి ప్ర‌భుత్వాల‌కు మ‌రో క్రేజీ స‌లహా ఇచ్చాడు. ప్రజలని లాక్‌డౌన్ పాటించాలంటే.. డ్రోన్ కు దెయ్యం సెట‌ప్ వేసి..బ‌య‌ట‌ తిరిగేవారిని భ‌య‌పెట్టాల‌ని పేర్కొన్నాడు. ఆర్మీ, పోలీస్ అవ‌స‌రం లేకుండా.. త‌క్కువ ఖ‌ర్చుతోనే ప్ర‌జ‌లును ఇళ్లకు ప‌రిమితం చెయొచ్చ‌ని చెప్పుకొచ్చాడు. పూరి చేసిన ఈ ట్వీట్ కు నెటిజ‌న్ల నుంచి ఊహించ‌ని మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.