కరోనా కాలం.. పెళ్లిని వాయిదా వేసుకున్న టాలీవుడ్ హీరో..!

ప్రపంచంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో భారత్ మొత్తం ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉంది. ఇళ్లను వదిలి వస్తోన్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 3:04 pm, Sun, 29 March 20
కరోనా కాలం.. పెళ్లిని వాయిదా వేసుకున్న టాలీవుడ్ హీరో..!

ప్రపంచంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో భారత్ మొత్తం ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉంది. ఇళ్లను వదిలి వస్తోన్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో శుభాకార్యాలను కొద్ది రోజులు వాయిదా వేసుకోండని ప్రభుత్వాలు కోరాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. అంతేకాదు సోమవారం జరగాల్సిన తన పుట్టినరోజు వేడుకలను కూడా జరపొద్దని ఆయన అభిమానులకు సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు నితిన్.

నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడి ఉన్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరపొద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేది జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లో మనం కాలు మీద కాలేసుకొని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు.. అని నితిన్ తెలిపారు. మరోవైపు అదే రోజున టాలీవుడ్ నటుడు నిఖిల్ వివాహానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.

Read This Story Also: కాలమే సమాధానం చెప్తుందంటే ఇదేనేమో.. బ్రిటీష్‌ను పరిపాలిస్తోన్న భారతీయులు..!