Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • అమరావతి: ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ. ఎమెర్జెన్సీ పనులు నిమిత్తం తమను కంపెనీలోకి అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎల్జీ పాలిమర్స్. రోజు వారీ కార్యకలాపాల కోసం కంపెనీలోనికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు 30 మందికి అనుమతి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పత్రం ఇవ్వలేదన్న కంపెనీ తరుపు న్యాయవాది.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • ఢిల్లీ: తబ్లిఘి జమాత్ కేసుకు సంబంధించి 294 మంది విదేశీయుల పై 15 చార్జిషీట్లను సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్న ఢిల్లీ పోలీసులు.
  • ఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే అధ్యక్షత ప్రారంభమైన ఆర్మీ కమాండర్ల సమావేశం. ఆర్మీ ఫోర్స్ టాప్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరు. లడఖ్లో చైనా దురాక్రమణతో సహా అన్ని భద్రతా సమస్యల పై చర్చ.
  • భారత్-చైనా సరిహద్దులకు రిజర్వు బలగాల మొహరింపు. రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ప్రధాని, రక్షణశాఖ మంత్రి. సరిహద్దుల్లో రోడ్లు, ఇతర నిర్మాణ పనులు ఆపొద్దని ఆదేశం. సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్న చైనా. మరోవైపు చైనాలో విస్తృతంగా రోడ్లు, ఎయిర్‌బేస్ ల నిర్మాణం. నేడు కోర్ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆర్మీ సమావేశం.

కాలమే సమాధానం చెప్తుందంటే ఇదేనేమో.. బ్రిటన్‌ను పరిపాలిస్తోన్న భారతీయులు..!

Coronavirus live updates, కాలమే సమాధానం చెప్తుందంటే ఇదేనేమో.. బ్రిటన్‌ను పరిపాలిస్తోన్న భారతీయులు..!

దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది.. మన పెద్దల దగ్గర నుంచి సాధారణంగా వినిపించే మాట ఇది. ఇప్పుడు బ్రిటన్‌లో పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది మరి. దాదాపు 200 సంవత్సరాల పాటు భారత్‌ను తమ చేతుల్లో పెట్టుకొని.. మన దేశ సంపదనంతా దోచుకోవడంతో పాటు ఎంతోమంది అమాయకపు ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న బ్రిటీష్‌ వారిని ఇప్పుడు భారతీయులే దిక్కయ్యారు. కరోనాతో ఆ దేశ రాణి (కోవిడ్ వచ్చినట్లు వార్తలు వచ్చినా.. అధికారికంగా ప్రకటించక లేదు), యువరాజు, ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రి ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక ఇలాంటి సమయాల్లో సాధారణంగా గ్రేట్ బ్రిటన్‌ను ఇంఛార్జ్ చేసే అవకాశం ఛాన్సలర్ ఆఫ్ ఎక్సెక్వర్‌ గానీ.. హోమ్ సెక్రటరీగానీ తీసుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆ పదవుల్లో ఉన్న ఇద్దరు(రిషి సునక్‌, ప్రీతి పటేల్‌) భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఓ మెసేజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. 300 సంవత్సరాల తరువాత సూర్యుడు అస్తమించని దేశాన్ని భారతీయులు పరిపాలిస్తున్నారు అని. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో రాబర్ట్ క్లైవ్‌, క్వీన్ విక్టోరియా, విన్‌స్టన్‌ చర్చిల్ ఆత్మలు సమాధుల్లో తిరుగుతూ ఉంటాయని కామెంట్ పెడుతున్నారు.

Read This Story Also: అలా చేసిన వారిపై కేసులు: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

Related Tags