AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యంః శ్రీధర్ బాబు

తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సోమవారం(ఏప్రిల్ 7) డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేక సమావేశమయ్యారు.

Telangana: 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యంః శ్రీధర్ బాబు
Minister Sridhar Babu Consulate General Of Singapore Edgar Pong
Prabhakar M
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 07, 2025 | 6:07 PM

Share

తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సోమవారం(ఏప్రిల్ 7) డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై అవగాహన ఒప్పందం చేస్తున్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో నిరుద్యోగ ఇంజనీర్లకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కు హబ్ గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ, అక్కడే ఏర్పాటు చేయబోతున్న ఏఐ యూనివర్సిటీ గురించి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యమయ్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయన్నారు.

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్ గా హైదరాబాద్ మారుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. పరిశ్రమల ఏర్పాటును ఒక్క హైదరాబాద్ కే పరిమితం చేయకుండా… వరంగల్, కరీంనగర్ లాంటి ఇతర నగరాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలపై స్థానిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని ప్రతినిధుల బృందాన్ని కోరారు. టెక్నాలజీ, స్కిల్ డెవలెప్ మెంట్, ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాన్సూల్ వైష్ణవి వాసుదేవన్, ఫస్ట్ సెక్రటరీ(ఎకానమిక్) వివేక్ రఘు రామన్, ఎంటర్ ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్(ఇండియా – సౌత్) డేనిస్ టాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..