Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంటికి ఒక్కరికి సుస్తీ.. మంచం పట్టిన మారుమూల పల్లె..!

మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కామారెడ్డి జిల్లా దౌల్తపూర్‌లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. బిచ్కుంద మండల కేంద్రానికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామంలో గత 15 రోజులుగా దాదాపు ఇంటికి ఒక్కరు చొప్పున అనారోగ్యం బారిన పడి అవస్థలు పడుతున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులతో పెద్ద చిన్నా తేడా లేకుండా అందరూ మంచం పట్టారు. చికెన్‌గున్యా లక్షణాలు ఉన్నట్లు గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Telangana: ఇంటికి ఒక్కరికి సుస్తీ.. మంచం పట్టిన మారుమూల పల్లె..!
Toxic Fevers
Follow us
Diwakar P

| Edited By: Balaraju Goud

Updated on: Apr 07, 2025 | 7:37 PM

మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కామారెడ్డి జిల్లా దౌల్తపూర్‌లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. బిచ్కుంద మండల కేంద్రానికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామంలో గత 15 రోజులుగా దాదాపు ఇంటికి ఒక్కరు చొప్పున అనారోగ్యం బారిన పడి అవస్థలు పడుతున్నారు. .జ్వరం, ఒళ్లు నొప్పులతో పెద్ద చిన్నా తేడా లేకుండా అందరూ మంచం పట్టారు. చికెన్‌గున్యా లక్షణాలు ఉన్నట్లు గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఎరియా ఆసుపత్రిలో వైద్యులు లేకపోవటంతో పక్కన మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు..

దౌల్తాపూర్ గ్రామంలో 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మండల కేంద్రం బిచ్కుందకు కూతవేటు దూరంలో ఉన్నా ఈ గ్రామ ప్రజల అవస్థలు పట్టించుకునే వారు కరువయ్యారు. గత 15 రోజులుగా ఇక్కడ విష జ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో ఒకటి రెండు కుటుంబాల్లో ఉన్న బాధితులు ఇపుడు దాదాపు ఇంటికి ఒక్కరు కనిపిస్తున్నారు. తమకు ఏం అంతుచిక్కని వ్యాధి సోకిందో అని భయభ్రాంతులకు గురి అవుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే దెగ్లూర్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

బిచ్కుంద లో ఏరియా అదుపత్రి ఉన్నప్పటికీ వైద్యులు లేరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ కూడా లేరు. ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో కేవలం నర్సు లు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో దౌల్తపూర్ గ్రామస్తులు ఈ ఆసుపత్రికి రాకుండా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వైద్య పేరుతో వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామంలో బాధితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని వేడుకుంటున్నారు. వేసవి కాలంలో విష జ్వరాలు వ్యాప్తి చెందటం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..