AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పైనుంచి చూస్తే ఇంటి సామాన్ల పెట్టెలే.. లోపల చెక్ చేయగా..

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులో తీసుకున్నారు ఎస్ఓటి పోలీసులు. ఒడిశా నుండి హర్యానాకు తెలంగాణ రాష్ట్రం మీదుగా గంజాయిని తరలిస్తున్నారు ఈ ముగ్గురు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 273 కిలోల గంజాయిను పట్టుకున్నారు పోలీసులు. ఆ వివరాలు ఇలా..

Telangana: పైనుంచి చూస్తే ఇంటి సామాన్ల పెట్టెలే.. లోపల చెక్ చేయగా..
Viral
Ravi Kiran
|

Updated on: Apr 07, 2025 | 8:04 PM

Share

ప్యాకర్స్ మూవర్స్ పేరుతో ఇంటి సామాన్లు తీసుకపోతున్నట్టు నమ్మించి అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ముఠాను షామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో డిసిపి కోటిరెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బోయిన్పల్లికి చెందిన ప్రదీప్ కుమార్ తన బొలేరో వాహనాన్ని ప్యాకర్స్ మూవర్స్ పని కోసం ఉపయోగిస్తూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన సన్నీ, మనీష్ కుమార్ పరిచయమయ్యారు. దీంతో బొలెరో వాహనానికి డ్రైవర్‌గా సన్నీ, హెల్పర్‌గా మనీష్ కుమార్ పని చేస్తూ ఉండేవారు. గత నెల మార్చి 31న ప్రదీప్ కుమార్ హర్యానా రాష్ట్రానికి చెందిన సాహిల్‌తో కలిసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి అక్కడ సుభాష్ కలిసి 273 కిలోల గంజాయి కోసం లక్ష 30 వేల రూపాయలు చెల్లించి గంజాయి కొనుగోలు చేశారు.

ఒడిశా నుండి హర్యానాకు తెలంగాణ రాష్ట్రం మీదుగా.. హర్యానా, పంజాబ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్నారని పక్కా సమాచారంతో శనివారం షామీర్పేట్ ఓఆర్ఆర్ వద్ద ఎస్ఓటి, షామీర్పేట్ పోలీసులు సైబరాబాద్ బృందం సంయుక్తంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న గంజాయి పట్టుకొని ముగ్గురిని షామీర్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 273 కిలోల గంజాయి, బొలెరో వాహనం, మొబైల్ ఫోనులు, జియో డంగిల్ స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి చెప్పారు. వీటి విలువ మొత్తం దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ప్రజలు గంజాయక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 9490617444 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని డిసిపి కోరారు.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే