Pawan Kalyan Son: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. కోలుకుంటున్న పవన్ చిన్న కుమారుడు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగపూర్ లోని ఓ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కళ్ళకు స్వల్ప గాయాలు అయ్యాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కాస్త ఇబ్బందిపడ్డాడు. ఇక విషయం తెలుసుకున్న పవన్ విశాఖ నుంచి సింగపూర్ కు వెళ్లారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి కూడా భార్య సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లారు. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్ కు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాగా మార్క్ శంకర్ కు పెద్దగా ప్రమాదమేమీ లేదని, క్షేమంగానే ఉన్నాడని పవన్ కళ్యాణ్, చిరంజీవి తెలిపారు.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి అరాచకం రా సామి..! ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి
మార్క్ శంకర్ కు ప్రమాదం జరిగిందని తెలిసి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు షేర్ చేశారు. తాజాగా సింగపూర్ ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ ఫోటో విడుదలైంది. మార్క్ శంకర్ క్షేమంగా ఉన్నట్టు ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : పర్మిషన్ లేకుండా రేప్ సీన్ షూట్.. కట్ చేస్తే హీరోపై కేసు పెట్టిన స్టార్ హీరోయిన్
కాగా మార్క్ శంకర్‌కి సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి శంకర్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు అయ్యాయని…పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఎమర్జెన్సీ వార్డులు చికిత్స అందించారన్నారు. మార్క్ కోలుకొంటున్నాడని, ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డు నుంచి మరో రూంకి షిఫ్ట్ చేశారన్నారు పవన్. కాగా మార్క్ శంకర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అగ్నిప్రమాదం తీవ్రతను మనం చూడొచ్చు. అలాగే పిల్లలను స్కూల్ భవనం నుంచి సిబ్బంది రక్షించడం కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు.
ఇది కూడా చదవండి :నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.. అలాంటివి పట్టించుకోనంటున్న టాలీవుడ్ సింగర్
Exclusive Visuvals…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు .. సింగపూర్ లోని రివర్ వేలి రోడ్డులోని… రోడ్ షాప్ హౌజ్ అనే మూడడుగుల బిల్డింగ్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో శంకర్ కు గాయాలు .. రెండో అంతస్తులోని టొమాటో స్కూల్🙏🙏#singaporeschool pic.twitter.com/8Hin42VCCw
— Ravindra Kumar Bandaru (@Ravindr59434697) April 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




