AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్మిషన్ లేకుండా రేప్ సీన్ షూట్.. కట్ చేస్తే హీరోపై కేసు పెట్టిన స్టార్ హీరోయిన్

రీసెంట్ డేస్ లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ కు, బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతున్న జనరేషన్స్ కు తగ్గట్టుగా సినిమాల్లోనూ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అలాగే యాక్షన్ సీన్స్ తో పాటు రొమాంటిక్స్ సీన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనదగ్గర బోల్డ్ సీన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పర్మిషన్ లేకుండా రేప్ సీన్ షూట్.. కట్ చేస్తే హీరోపై కేసు పెట్టిన స్టార్ హీరోయిన్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 08, 2025 | 1:23 PM

సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ కు కొదవే లేదు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చాలా కామన్ అయ్యాయి. అయితే కొంతమంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి వెనకాడటం లేదు.. సినిమా కథ డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్స్ అయినా.. ఎలాంటి సీన్స్ అయినా చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం అయిష్టంగానే రొమాంటిక్స్ సీన్స్ లో నటిస్తున్నారు. అలాగే చాలా మంది నటీమణులు తమకు సినిమా సెట్స్ లో ఎదురైనా చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. అయితే ఓ హీరోయిన్ తన పర్మిషన్ లేకుండా సినిమాలో రేప్ సీన్ పెట్టారని ఏకంగా హీరో పైనే కేసు పెట్టింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆ సినిమా ఎదో మీకు తెలుసా.?

తనకు చెప్పిన కథలో ఆ సీన్ లేదని, అలాగే అగ్రిమెంట్ లోనూ అది లేదని తెలిపింది. కానీ సినిమా సెట్ లో మాత్రం రేప్ సీన్ షూట్ చేశారని తెలిపింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన అయేషా జుల్కా. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక ఈ స్టార్ హీరోయిన్ అప్పటి హీరో మిథున్ చక్రవర్తి తో కలిసి ఓ సినిమాలో నటించినందుకు బాధపడుతున్నట్టు తెలిపింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓ మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ఓ సినిమాలో తన పర్మిషన్ లేకుండా.. ఓ రేప్ సీన్‌లో తన బాడీ డబుల్ వాడి ప్రొడ్యూసర్లు మోసం చేశారని ఆరోపించింది. పార్థో ఘోష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘దలాల్’ మూవీలో అయేషా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కథ విన్నప్పుడు, అగ్రిమెంట్ లో ఎక్కడా కూడా తనకు రేప్ సీన్ గురించి చెప్పలేదట. అయితే తనకు చెప్పకుండా.. తన పర్మిషన్ లేకుండా రేప్ సీన్  షూట్ చేశారట. అది చూసిన చాలా మంది ఎందుకు ఇలా చేశావ్.? అని తనను అడిగారట దాంతో ఆమె ఆగ్రహం ఆపుకోలేక ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లో కేసు వేసి, కంప్లైంట్ చేసినట్టు తెలిపింది అయేషా..

Ayesha Jhulka

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్
సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్
'ఎంత తోప్ బౌలరైనా భయపడేది లే'.. సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్
'ఎంత తోప్ బౌలరైనా భయపడేది లే'.. సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్
హల్దీ వేడులకల్లోకి డైనోసోర్.. గెటప్‌ తీసి చూడగా అశ్చర్యపోయిన..
హల్దీ వేడులకల్లోకి డైనోసోర్.. గెటప్‌ తీసి చూడగా అశ్చర్యపోయిన..
ఈ టైమ్‌లో నడిస్తే బరువు ఇట్టే తగ్గుతారు..
ఈ టైమ్‌లో నడిస్తే బరువు ఇట్టే తగ్గుతారు..
వణికిపోతున్న పాకిస్తాన్.. పీఓకేలోని ఉగ్ర శిబిరాలు ఖాళీ..!
వణికిపోతున్న పాకిస్తాన్.. పీఓకేలోని ఉగ్ర శిబిరాలు ఖాళీ..!
ఏడూ, ఎనిమిదిమందిని ప్రేమించా.. 23 ఏళ్లకే అన్ని చూసేశా..
ఏడూ, ఎనిమిదిమందిని ప్రేమించా.. 23 ఏళ్లకే అన్ని చూసేశా..
చిరంజీవికి చెల్లిగా.. భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
చిరంజీవికి చెల్లిగా.. భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
14 ఏళ్ల కుర్రాడి ఊచకోత.. పాయింట్ల పట్టికలో గుజరాత్‌కు బిగ్ షాక్?
14 ఏళ్ల కుర్రాడి ఊచకోత.. పాయింట్ల పట్టికలో గుజరాత్‌కు బిగ్ షాక్?
గాయపడిన కేటీఆర్‌.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్..
గాయపడిన కేటీఆర్‌.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్..
11 సిక్స్‌లు, 7 ఫోర్లు.. 265 స్ట్రైక్‌రేట్‌తో సూర్యవంశీ బీభత్సం
11 సిక్స్‌లు, 7 ఫోర్లు.. 265 స్ట్రైక్‌రేట్‌తో సూర్యవంశీ బీభత్సం