AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్‌ కుమారుడు ప్రమాదంపై స్పందించిన చిరంజీవి, చంద్రబాబు, లోకేష్, కేటీఆర్, జగన్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు

పవన్‌ కుమారుడు ప్రమాదంపై స్పందించిన చిరంజీవి, చంద్రబాబు, లోకేష్, కేటీఆర్, జగన్
Pawan Kalyan
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2025 | 12:49 PM

Share

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ సింగపూర్ కు బయలుదేరారు. పవన్ ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్నారు. గాయపడిన మార్క్ శంకర్ కు సింగపూర్ లో చికిత్స అందిస్తున్నారు. కాగా పవన్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడటం పై సినిమా ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ ఘటన పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 8 ఏళ్ల  మార్క్‌ శంకర్‌ ప్రస్తుతం బాగానే ఉన్నాడు.. కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి అని చిరంజీవి తెలిపారు.

అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ..  మార్క్‌శంకర్‌కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది.  సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అలాగే నారా లోకేష్ స్పందిస్తూ..”మార్క్‌ శంకర్‌కు గాయాలు కావడం బాధాకరం. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుని షాక్‌కు గురయ్యా.. మార్క్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ క్లిష్ట సమయంలో పవన్‌ కుటుంబానికి ధైర్యం చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని లోకేష్ పేర్కొన్నారు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ.. “సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను, అందులో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి దైర్యం చేకూరాలని, ఆ చిన్నారి త్వరగా.. పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. పవన్‌ కుమారుడు ప్రమాదంపై బండి సంజయ్ స్పందించారు. “మార్క్‌ శంకర్‌కు గాయాలు కావడం బాధ కలిగించింది.త్వరగా కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అని బండి సంజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అదేవిధంగా ఈ ఘటన పై కేటీఆర్ స్పందిస్తూ.. మార్క్‌శంకర్‌ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందా.. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

బండి సంజయ్ ట్వీట్ ..

చంద్రబాబు ట్వీట్

లోకేష్ ట్వీట్..

జగన్ ట్వీట్..

సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను, అందులో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి దైర్యం చేకూరాలని, ఆ చిన్నారి త్వరగా.. పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

కేటీఆర్ ట్వీట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..