AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా హిట్ అయినా నన్ను ప్రమోషన్స్‌కు పిలవలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆ సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా తిరుగుతూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు హీరో, హీరోయిన్స్..

సినిమా హిట్ అయినా నన్ను ప్రమోషన్స్‌కు పిలవలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2025 | 12:22 PM

Share

సినిమా విడుదల అవుతుందంటే.. ప్రమోషన్స్ మాములుగా ఉండవు. ఇప్పుడు అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నాయి. దాంతో దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఒక్క పాన్ ఇండియా సినిమా విడుదల అవుతుందంటే ఆ సినిమా హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత ఇలా అందరూ ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్నారు. అంతే కాదు ఒక్క సినిమా విడుదలకు ముందు మినీమన్ ఐదు ఈవెంట్లు చేస్తున్నారు. ప్రెస్ మీట్, సినిమా అనౌన్స్ మెంట్, ఫస్ట్ సాంగ్ రిలీజ్, గ్లింప్స్ రిలీజ్, టీజర్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్  ఇలా ఎదో ఒక ఈవెంట్ చేసి సినిమాను జనల దగ్గరకు తీసుకెళ్తున్నారు. అయితే కొన్ని సినిమాల ప్రమోషన్స్ లో హీరోయిన్స్ కనబటం లేదు. నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటారు.

అయితే ఓ యంగ్ హీరోయిన్ తనను సినిమా ప్రమోషన్స్ కు పిలవలేదు అని తెలిపింది. సినిమా విడుదలకు ముందు, విడుదలైన తర్వాత కూడా తనను ప్రమోషన్స్ కు పిలవలేదు అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు. మన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. ఈ అమ్మడు షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా మారింది ఈ చిన్నది. ఆతర్వాత ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో మరో హిట్ అందుకుంది.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయింది ఈ చిన్నది. రీసెంట్ గా మ్యాడ్ 2 సినిమాలో మెరిసింది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో మీరు ఎందుకు ఎస్ ఆర్ కల్యాణమండపం ప్రమోషన్స్ లో కనిపించలేదు అని యాంకర్ అడగ్గా.. నన్ను పిలవలేదు అని సమాధానం ఇచ్చింది. మీ మాట్లాడుతూ.. సాంగ్స్ , టీజర్ క్లిక్ అయ్యాయి కదా ప్రమోషన్స్ ఎక్కువ అవసరం లేదు ఏమో అని అనుకున్నాను. నన్ను పిలిస్తే నేను వెళ్లేదాన్ని కానీ పిలవలేదు.. ఎప్పుడు పిలిచారంటే.. సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత.. ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సమయంలో నన్ను పిలిచారు.. రిలీజ్ కు ముందు పిలవలేదు.. ఇప్పుడు పిలిచినా ఏం లాభం అనిపించింది అని తెలిపింది. ఇక ప్రియాంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ప్రియాంక జవాల్కర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత