అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ

నా సినిమా అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితేనే నాకు సంతోషమని అని అన్నారు డైరెక్టర్ రాజమౌళి. పిరియాడికల్, యాక్షన్ యాంగిల్‌లో ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) రూపొందుతోన్న విషయం తెలిసిందే. చారిత్రక వీరులైన కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో..

అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ
Follow us

| Edited By:

Updated on: Mar 31, 2020 | 9:37 AM

నా సినిమా అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి కూడా రీచ్ అయితేనే నాకు సంతోషమని అని అన్నారు డైరెక్టర్ రాజమౌళి. పిరియాడికల్, యాక్షన్ యాంగిల్‌లో ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) రూపొందుతోన్న విషయం తెలిసిందే. చారిత్రక వీరులైన కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తోన్నారు. ఈ మధ్యే ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించింది చిత్ర బృందం. అలాగే తాజాగా చెర్రీ బర్త్ డే సందర్భంగా.. సీతారామ రాజుగా చరణ్ ఇంట్రడక్షన్ సూపర్ రెస్పాన్స్ అందుకోంది. ముఖ్యంగా మెగా, నందమూరి అభిమానులను అలరించింది. అయితే రీసెంట్‌గా రాజమౌళి ఓ బాలీవుడ్ క్రిటిక్‌కి వీడియో చాట్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘ఆర్ఆర్ఆర్‌’లో ఇద్దరు హీరోలు ఉన్నారు. మరి వారి అభిమానుల గురించి ఆలోచించారా? వాళ్ల అంచనాలను అందుకుంటానని మీరనుకుంటున్నారా? అని క్రిటిక్ అడిగిన ప్రశ్నకు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. అందరికీ వేరువేరుగా అభిమానులు ఉంటారు. నా హీరోలకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అభిమానులు అనేవారు చాలా తక్కువమందే ఉంటారు. వారి కంటే కూడా నేను తీసిన సినిమా జనరల్ ఆడియన్స్‌కి బాగా రీచ్ అవ్వాలని అనుకుంటాను. ఎందుకంటే.. హీరోల ఫ్యాన్స్ ఖచ్చితంగా సినిమా చూస్తారు. కానీ ఆడియన్స్ అందరూ చూడగలిగితేనే ఆ సినిమా హిట్ అయినట్టు నా అభిప్రాయం. అలా రీచ్ అయితేనే నేను సంతోషిస్తాను రాజమౌళి’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి: వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’

వాట్సాప్ నుంచే ఐసిఐసిఐ బ్యాంకు సేవలు

ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి

ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు

లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కరోనా వైరస్ సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే? మీకోసమే!