పిల్లల్ని ఎప్పుడు కనాలో నాకు తెలుసు.. అనుష్క హాట్ కామెంట్స్
నేను డబ్బులను సంపాదించడానికి సినిమాల్లోకి రాలేదు. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పుడే కాదు.. మొదటి నుంచీ నేను డబ్బుల కోసం సినిమాలు చేయలేదు. నేను సినిమాలు చేయడం లేదంటే..

బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో అనుష్క శర్మ ఒకరు. సైలెంట్‌గా ప్రేమించుకుని కొహ్లీ, అనుష్క వివాహంతో ఒకటి అయ్యారు. సాధారణంగా పెళ్ళయిన తరువాత హీరోయిన్లు కాస్త బ్రేక్ తీసుకుంటారు. కానీ అనుష్క మాత్రం ఇంకా బిజీ అయ్యిందనే చెప్పాలి. ఓ వైపు సినీ నిర్మాణం, మరోవైపు సినిమా, భర్త విరాట్ పనులు, క్లాత్ బిజినెస్ ఇలా బిజీబిజీగా ఉండే అనుష్కకి ఇటీవలి కాలంలో కాస్త విరామాన్ని తీసుకోవాలనుకుంటోందట. అయితే పిల్లల్ని కనడానికే అనుష్క బ్రేక్ తీసుకుంటోందని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా ఇటీవల ఆమె హాట్ కామెంట్స్ చేసింది.
‘నేను డబ్బులను సంపాదించడానికి సినిమాల్లోకి రాలేదు. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పుడే కాదు.. మొదటి నుంచీ నేను డబ్బుల కోసం సినిమాలు చేయలేదు. నేను సినిమాలు చేయడం లేదంటే.. నాకు నచ్చిన కథ దొరకడం లేదని అర్థం. ఇప్పుడు డబ్బులు కోసమని వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోవల్సిన అవసరం లేదు. నాకు సినిమాలతో పాటు చాలా పనులున్నాయి. నచ్చిన కథ దొరికితే నేను నటించడమే కాదు.. నిర్మించడానికి కూడా నేను సిద్ధం. అలాగే నేను తల్లిని కావడానికే విరామం తీసుకున్నానని.. చాలా వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. నటిస్తూ కూడా పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు. నేను పిల్లల్ని కనడానికి ఇంకా సమయముంది. అయినా పిల్లల్ని ఎప్పుడు కనాలన్నది నా వ్యక్తిగతం. ఈ విషయంలో ఇతరులకు ఆసక్తి అనవసరం అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది’ అనుష్క శర్మ.
ఇవి కూడా చదవండి:
అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ
వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’
వాట్సాప్ నుంచే ఐసిఐసిఐ బ్యాంకు సేవలు
ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి
ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు
లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ
డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే
కరోనా వైరస్ సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే? మీకోసమే!