10 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించాం.. ఫైట్ చేద్దాం.. ట్రంప్

తమ దేశంలో 10లక్షలమందికి పైగా ప్రజలకు కరోనా టెస్టులు నిర్వహించామని, అమెరికా చరిత్రలో ఇదో మైలురాయి అన్నారు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. సామాజిక దూరానికి సంబంధించిన ఆంక్షలు, మార్గదర్శక సూత్రాలు,

10 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించాం.. ఫైట్ చేద్దాం.. ట్రంప్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 31, 2020 | 10:39 AM

తమ దేశంలో 10లక్షలమందికి పైగా ప్రజలకు కరోనా టెస్టులు నిర్వహించామని, అమెరికా చరిత్రలో ఇదో మైలురాయి అన్నారు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. సామాజిక దూరానికి సంబంధించిన ఆంక్షలు, మార్గదర్శక సూత్రాలు, నిబంధనలను ఖఛ్చితంగా అమలు చేస్తామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికన్లంతా వచ్ఛే ఏప్రిల్ నెల అంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా, యూరప్ దేశాలతో ప్రయాణ సంబంధ ఆంక్షలు ఇంకా అమలులోనే ఉంటాయని  ఆయన తెలిపారు. వైట్ హౌస్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 10 మందికి మించి వ్యక్తులు గుంపులుగా గుమికూడరాదని, రెస్టారెంట్లు, బార్లలో డైనింగ్ వంటివాటికి స్వస్తి చెప్పాలని కోరుతున్నానని అన్నారు. ప్రతివారూ ఈ ఆంక్షలను పాటించాలన్నారు. కరోనాపై చేసే వార్ లో అందరూ పాల్గొనాల్సిందే.. ఇది దేశభక్తికి నిదర్శనం కూడా అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రానున్న 30 రోజులూ మనకు చాలా కీలకం.. ఇది మనకు ఓ సవాలే అన్నారు. కరోనా నివారణకు పర్సనల్ ప్రొటెక్టివ్ సాధనాలను పొందేందుకు యత్నిస్తున్నామని, అలాగే మన దేశానికి అవసరం లేని సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన మెడికల్ పరికరాలను ఇటలీకి సరఫరా చేస్తున్నామని ట్రంప్ వివరించారు. కరోనా వైరస్ నివారణకు వైట్ హౌస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కో-ఆర్డినేటర్ దెబోరా బిర్క్స్ మాట్లాడుతూ.. అన్ని రాష్టాలూ కరోనా సమస్యను ఎదుర్కొంటున్నాయని, అందువల్ల ఫెడరల్ గైడెన్స్ అన్నది ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం