వాట్సాప్ నుంచే ఐసిఐసిఐ బ్యాంకు సేవలు
వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది ఐసిఐసి బ్యాంకు. బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే.. మీ సర్వీసులను ఉపయోగించుకునే విధంగా చేసింది. అది కూడా ఎంతో సులువుగా. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా..

వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది ఐసిఐసి బ్యాంకు. బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే.. మీ సర్వీసులను ఉపయోగించుకునే విధంగా చేసింది. అది కూడా ఎంతో సులువుగా. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పడిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ ఇంకా ఏప్రిల్ 14వ తేదీ వరకూ కొనసాగనుంది. దీంతో అన్నీ మూతపడ్డాయి. కేవలం అత్యవసర సేవలను మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో బ్యాంక్ ఒకటి. ఇప్పటికే కొంతమంది మొబైల్, ఏటీఎమ్‌ల ద్వారా వారి బ్యాంక్ ఖాతా వివరాలను తెలుసుకుంటున్నారు. కానీ అక్కడక్కడ ఏటీఎమ్‌లు పని చేయకపోవడంతో బ్యాంక్‌కు క్యూ కడుతున్నారు. దీంతో.. దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ ద్వారా సేవలను అందించాలని నిర్ణయించింది ఆ సంస్థ.
దీని ద్వారా ఖాతా నిల్వ, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ వివరాలు, తక్షణ లోన్, కార్డులు బ్లాక్ అండ్ అన్ బ్లాక్, గత మూడు నెలల లావాదేవీల వివరాలను తెలుసుకోవచ్చు. బ్యాంక్ రిజిస్టర్ నెంబర్ 93249 53001కి వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ పంపాలి. వెంటనే బ్యాంకు సర్వీసుల లిస్ట్ వస్తుంది. దాంట్లో మానకు అవసరమైన దాని కీవర్డ్స్‌ను టైప్ చేస్తే చాలు. ఇప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. అందుకే ఐసిఐసిఐ బ్యాంక్.. కస్టమర్లకు మరింత చేరువడానికి ఈ సర్వీసును ప్రారంభించినట్టు ఆ బ్యాంక్ ఎండీ తెలిపారు. కాగా ఈ సేవలను దేశ వ్యాప్తంగా.. ఐసిఐసిఐ బ్యాంకు ఖాతా ఉన్నవారు ఉపయోగించుకోవచ్చన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి
ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు
లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ
డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే
కరోనా వైరస్ సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే? మీకోసమే!