AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alekhya Chitti Pickles: సిస్టర్స్ వచ్చేశారోయ్.! అలేఖ్య చిట్టి పికిల్స్ కాదు.. ఇకపై రమ్య మోక్ష

అలేఖ్య చిట్టి పికిల్స్ అంశం.. సోషల్ మీడియాలో ఏమాత్రం రచ్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సిస్టర్స్ పై మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజులో వచ్చాయి. ఆఖరికి అలేఖ్య చిట్టి ఆస్పత్రిలో కూడా చేరాల్సి వచ్చింది. ఇప్పుడు మరో కొత్త బిజినెస్ తో సిస్టర్స్ వచ్చేస్తున్నారు.

Alekhya Chitti Pickles: సిస్టర్స్ వచ్చేశారోయ్.! అలేఖ్య చిట్టి పికిల్స్ కాదు.. ఇకపై రమ్య మోక్ష
Alekhya Chitti Pickles
Ravi Kiran
|

Updated on: Apr 18, 2025 | 8:36 PM

Share

నువ్వు లైఫ్‌లో ఎంత ఎదగాలంటే పావుకిలో అలేఖ్య చిట్టి పికిల్స్ కొనేంత స్థాయికి ఎదగాలి. అప్పుడే నువ్వు లైఫ్‌లో సెటిల్ అయినట్టు. ‘ఆఫ్ట్రాల్ పచ్చళ్లే కొనలేకపోతున్నావ్. రేపు నీ వైఫ్ బంగారం అడిగితే ఏం కొనిస్తావ్.? నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయాలమ్మా.? పచ్చళ్లు కొనలేని డ్యాష్ గాన్వి నీకెందుకురా ఇవ్వన్ని.?’ ఇదిగో ఇది గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసిన హాట్ టాపిక్. అలేఖ్య చిట్టి పికిల్స్‌కి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో.. ఏదైతే సోషల్ మీడియాతో ఆ బిజినెస్ వైరల్ అయిందో.. అదే సోషల్ మీడియాతో ఇప్పుడు క్లోజ్ అయింది. అయితే ఆ తర్వాత అక్కాచెల్లెళ్లు క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. కానీ వీరిపై విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ ఏ రేంజులో వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా వాటి వల్ల అలేఖ్య ఆస్పత్రిలో కూడా చేరాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం అలేఖ్య చిట్టి పికిల్స్ గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా వారికి సంబంధించిన మరో వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరైన రమ్య కంచర్ల తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ మొత్తంగా క్లోజ్ అయిందని.. కానీ త్వరలోనే కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టు పేర్కొంది. తాము నెక్స్ట్ ఏం బిజినెస్ చేయబోతున్నామోనని ఆమె తెలిపింది. 11 నెలల పాటు తమ అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ బాగా సాగిందని.. అయితే ఇటీవల జరిగిన పరిణామాల వల్ల 11 నెలలకే తమ బిజినెస్ మూసేశామని తెలిపింది. ఇక త్వరలోనే అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని రమ్య మోక్ష పికిల్స్ పేరుతో కొత్తగా స్టార్ట్ చేస్తామని చెప్పింది. తమ కస్టమర్స్, బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ మళ్లీ మేము గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకున్నారని.. అందుకే మరికొన్ని నెలలు సమయం పట్టినా ధైర్యంగా మళ్లీ మీ ముందుకు వస్తామని ఆమె చెప్పింది. అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా చూసుకుంటామని చెప్పింది.

అయితే మునుపటిలా తమకు మద్దతు ఉంటుందా.. లేదా.. అనేది తెలియదంది. ఇక ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కస్టమర్లతో మాట్లాడేందుకు ఓ వ్యక్తిని కూడా పెట్టుకుందామని ఆలోచిస్తున్నట్టుగా తెలిపింది. ఈ కొత్త వ్యాపారంలో అక్క అలేఖ్యను ఇన్వాల్వ్ చేయబోమని రమ్య కంచర్ల చెప్పింది. మొత్తం తానే చూసుకుంటానని తెలిపింది.