AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: భారీ వర్షం ధాటికి పెచ్చులూడిన చార్మినార్‌… భాగ్యలక్ష్మి ఆలయం వైపు పడిన పెచ్చులు

హైదరాబాద్‌లో గురువారం వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. చార్మినార్‌ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్ష ప్రభావం కారణంగా చారిత్రక కట్టడం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భాగ్యలక్ష్మి దేవాలయం వైపున ఉన్న మినార్‌లో పై కప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ దృశ్యాలు...

Video: భారీ వర్షం ధాటికి పెచ్చులూడిన చార్మినార్‌... భాగ్యలక్ష్మి ఆలయం వైపు పడిన పెచ్చులు
Charminars Minaret Falls
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Apr 03, 2025 | 7:30 PM

Share

హైదరాబాద్‌లో గురువారం వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. చార్మినార్‌ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్ష ప్రభావం కారణంగా చారిత్రక కట్టడం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భాగ్యలక్ష్మి దేవాలయం వైపున ఉన్న మినార్‌లో పై కప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. గతంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇదే మినార్‌ పైభాగం నుంచి పెచ్చులు ఊడిపడిన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

చార్మినార్ కు నాలుగు మినార్‌లు ఉండగా, వాటిలో ఓ మినార్‌కు పగుళ్లు ఏర్పాడ్డాయి. గతంలో ఒక మినార్ పెచ్చులు ఊడి నేలపై పడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కట్టడాన్ని పరిశీలించారు. అనంతరం మరమ్మతు చర్యలు చేపట్టారు.

గోల్కొండ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్ ను నిర్మించారు. క్రీస్తుశకం 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ కట్టడాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. చార్మినార్‌కి ఇలా పెచ్చులూడటం ఇదే తొలిసారి కాదు. గత 20-30 సంవత్సరాల్లో అనేకసార్లు చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి.

నిజానికి చార్మినార్ ప్రధాన కట్టడానికి సమస్య లేకపోయినా, చుట్టూ ఉండే సున్నపు మిశ్రమంతో చేసిన అదనపు నిర్మాణాలు కొంత కాలంగా దెబ్బతింటూ వస్తున్నాయి. భారత పురావస్తు శాఖ దీనికి మరమ్మతులు చేపడుతూనే ఉంది. అయితే తాజాగా కురిసిన భారీ వర్షానికి పెచ్చులు ఊడిపడటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.

వీడియో చూడండి:

ఒకే ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు మెయిడెన్లే.. టీ20ఐల్లో డేంజరస్ వీళ్లు
ఒకే ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు మెయిడెన్లే.. టీ20ఐల్లో డేంజరస్ వీళ్లు
కేంద్ర బడ్జెట్‌ 2026 లైవ్‌ అప్‌డేట్స్‌.. లైవ్ వీడియో
కేంద్ర బడ్జెట్‌ 2026 లైవ్‌ అప్‌డేట్స్‌.. లైవ్ వీడియో
ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్..
ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్..
అరుదైన నాలుగు రాజయోగాలు.. ఈ రాశులవారికి అదృష్టం, డబుల్ జాక్‌పాట్
అరుదైన నాలుగు రాజయోగాలు.. ఈ రాశులవారికి అదృష్టం, డబుల్ జాక్‌పాట్
అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..
అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..
చిరు vs బాలయ్య.. 2023 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోందా?
చిరు vs బాలయ్య.. 2023 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోందా?
నిర్మలమ్మ బడ్జెట్ చీర వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా..?
నిర్మలమ్మ బడ్జెట్ చీర వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా..?
5 వేలతో మొదలై 900 కోట్లకు.. ఇన్‌స్పైరింగ్ జర్నీ ఆఫ్ ఐశ్వర్యారాయ్
5 వేలతో మొదలై 900 కోట్లకు.. ఇన్‌స్పైరింగ్ జర్నీ ఆఫ్ ఐశ్వర్యారాయ్
అదృష్టమే అదృష్టం.. మరో రెండు రోజుల్లో కోటీశ్వరులయ్యేది వీరే!
అదృష్టమే అదృష్టం.. మరో రెండు రోజుల్లో కోటీశ్వరులయ్యేది వీరే!
తల్లయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకున్న స్టార్ హీరోయిన్!
తల్లయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకున్న స్టార్ హీరోయిన్!