- Telugu News Photo Gallery Cricket photos IPL 2025: RCB Coach Andy Flower Gives Key Update on Virat Kohli Injury
Virat Kohli: కోహ్లీ గాయంపై కీలక అప్‌డేట్.. ముంబైతో ఆడడంపై డౌటే.. ఆర్‌సీబీ కోచ్ ఏమన్నాడంటే?
IPL 2025: Virat Kohli Injury Update: ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 169 పరుగులు చేసింది. కానీ, గుజరాత్ టైటాన్స్ కేవలం 17.5 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. ఇప్పుడు కోహ్లీ గాయం గురించి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.
Updated on: Apr 03, 2025 | 6:30 PM

IPL 2025: ఐపీఎల్ 14వ మ్యాచ్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లీ చేతికి గాయమైంది.

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ డీప్ మిడ్-వికెట్ వైపు కొట్టిన బంతిని క్యాచ్ చేయడానికి కోహ్లీ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన చీలమండకు గాయమైంది. బంతి తగిలి కోహ్లీ నొప్పితో కుప్పకూలిపోయాడు. ఈ గాయం కారణంగా విరాట్ కోహ్లీ తదుపరి మ్యాచ్‌కు ఆడటం సందేహమేనని తెలుస్తోంది.

ఆర్‌సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ ఇప్పుడు విరాట్ కోహ్లీ గాయం గురించి సమాచారం ఇచ్చారు. కోహ్లీ గాయం తీవ్రమైనది కాదు. కోహ్లీ బాగానే ఉన్నాడని, తదుపరి మ్యాచ్‌లో ఆడగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

అందువల్ల, ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడటం ఖాయం. ఎందుకంటే, ఈ మ్యాచ్ కు ఇంకా మూడు రోజులు మిగిలి ఉంది. ఈ లోపు అతని వేలి గాయం పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీ మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించిన ఆర్‌సీబీ, రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. కానీ, సొంత మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవడంతో నిరాశలో కూరుకపోయారు. అయితే, ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఆర్‌సీబీ తిరిగి విజయాల బాటలోకి వస్తుందని నమ్మకంగా ఉంది.




