AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్-19 దెబ్బ.. కుదేలైన పారిశ్రామిక రంగానికి ఇక వరాలు.. రాయితీలు

కరోనా వైరస్, లాక్ డౌన్ ఒక్కసారిగా వఛ్చిపడడంతో.. తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలను,  ఇతర రంగాలను ఆదుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. రెండో ఎకనమిక్ ప్యాకేజీని ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. వీటితో బాటు సర్వీసులు, ఎగుమతుల రంగాలకు పన్ను రాయితీలను కల్పించనుంది. మొదట అత్యవసరమైన హెల్త్ కేర్ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ  సెక్టార్లను ‘పునరుజ్జీవింపజేసేందుకు’  భారీ ప్యాకేజీని ప్రకటించడానికి అనువుగా ప్రపంచ బ్యాంకుతో ప్రభుత్వం అప్పుడే […]

కోవిడ్-19 దెబ్బ.. కుదేలైన పారిశ్రామిక రంగానికి ఇక వరాలు.. రాయితీలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 31, 2020 | 4:58 PM

Share

కరోనా వైరస్, లాక్ డౌన్ ఒక్కసారిగా వఛ్చిపడడంతో.. తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలను,  ఇతర రంగాలను ఆదుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. రెండో ఎకనమిక్ ప్యాకేజీని ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. వీటితో బాటు సర్వీసులు, ఎగుమతుల రంగాలకు పన్ను రాయితీలను కల్పించనుంది. మొదట అత్యవసరమైన హెల్త్ కేర్ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ  సెక్టార్లను ‘పునరుజ్జీవింపజేసేందుకు’  భారీ ప్యాకేజీని ప్రకటించడానికి అనువుగా ప్రపంచ బ్యాంకుతో ప్రభుత్వం అప్పుడే చర్చలు ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఈ ప్యాకేజీని రూపొందిస్తున్నామని,  త్వరలో దీన్ని ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ రాయితీల్లో.. కొన్ని రంగాలకు గాను పన్ను చెల్లింపులపై మారటోరియం విధింపు, దిగుమతి, ఎగుమతి సుంకాల తగ్గింపు, బకాయిల చెల్లింపుల్లో సడలింపు వంటివి ఉన్నాయన్నారు.

ఎగుమతులకు సంబంధించి పర్ఫార్మెన్స్ అనుసంధానిత ఇన్సెంటివ్ లను దృష్టిలో ఉంచుకుని షరతులను సరళీకృతం చేయవచ్ఛునని తెలుస్తోంది. 21 రోజుల లాక్ డౌన్ కారణంగా ఏవియేషన్, ట్రావెల్, టూరిజం వంటి అనేక రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే పేద, మధ్య తరగతి వర్గాలను ఆదుకునేందుకు రూ. 1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఇక రిజర్వ్ బ్యాంకు రెపోరేటును 75 బేసిస్ పాయింట్లకు తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తికి సంబంధించి 100 బేసిస్ పాయింట్లను కుదించడం, రుణ చెల్లిపులపై మూడు నెలల మారటోరియం విధింపు వంటి వివిధ కీలక చర్యలను ప్రకటించింది.