22 April 2024
TV9 Telugu
క్రెడిట్ స్కోర్ పెరగడానికైనా, తగ్గడానికైనా మీరు తీసుకున్న అప్పులకు సంబంధించి చేస్తున్న చెల్లింపుల తీరే ప్రధానం. సకాలంలో చెల్లింపు చేస్తే స్కోర్ పెరుగుతుంది
లోన్ పేమెంట్స్ ఉన్నట్లయితే క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. ఆలస్యమైతే తగ్గుతుంది. అలాగే అనవసరంగా లోన్ గ్యారంటీలకు వెళ్లకపోవడమే మంచిది
అపరిమితంగా ఉండే రుణ భారం కూడా క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. అందుకే అనవసరంగా అప్పులు చేయవద్దు
మీకు అవసరమైతే తప్ప రుణాల కోసం బ్యాంకుల్లో విచారణలూ చేయకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు
మీ క్రెడిట్ స్కోర్‌ను తరచూ చెక్ చేసుకోవాలి. దీనివల్ల మీ రుణదాతలు చేసిన పొరబాట్లను గుర్తించి, సరిచేసుకోవచ్చు
రుణదాతలిచ్చే సమాచారం ప్రకారమే సిబిల్ స్కోర్ పెరగడం తగ్గడం ఉంటుంది. కొన్నిసార్లు మన క్రెడిట్ స్కోర్‌ను అప్‌డేట్ చేయడం బ్యాంకర్లు మర్చిపోతారు
మీరు ఏయే రుణాలను తీసుకుంటున్నారనేదానిపైన కూడా మీ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. వాటిని ఎంత బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నారన్నది కీలకంగా ఉంటుంది
వాహన, గృహ, వ్యక్తిగత, విద్య, క్రెడిట్ కార్డు, గృహోపకరణాల రుణాల నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ)ను మరువద్దు