భారత్ నుండి సౌదీ అరేబియా ఏమి దిగుమతి చేసుకుంటుందో తెలుసా?
TV9 Telugu
23 April 2024
భారతదేశం చాల దేశాలకు మన దగ్గర దొరికే వస్తువులను చాల దేశాలకు ఎగుమతి చేస్తుంది. వాటిలో సౌదీ అరేబియా కూడా ఒకటి.
సౌదీ అరేబియా వాణిజ్యంలో భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామి. 2022-23 ఆర్థిక సంవత్సంలో సౌదీ అరేబియాతో భారతదేశ మొత్తం వాణిజ్యంలో 4.53%.
భారతదేశం నుండి సౌదీ అరేబియాకు ఎగుమతి చేసే ప్రధాన వస్తువులలో బియ్యం, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, వస్త్రాలు ఉన్నాయి.
సౌదీ అరేబియా కూడా భారతదేశం నుండి ఇంజనీరింగ్ వస్తువులు, ఆహార ఉత్పత్తులు, సిరామిక్ టైల్స్ పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంది.
2021-22 సంవత్సరంలో భారతదేశం నుండి సౌదీ అరేబియా $1,550.54 మిలియన్ విలువైన వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేసింది.
సౌదీ అరేబియా ప్రధానంగా బియ్యం, బాస్మోతి, చక్కెర, గేదె మాంసం, సుగంధ ద్రవ్యాలు, బెల్లం, వేరుశెనగలను భారతదేశం నుండి దిగుమతి చేసుకుంటుంది.
సౌదీ అరేబియా నుండి భారతదేశానికి ప్రధాన దిగుమతి వస్తువులు ముడి చమురు, LPG, రసాయనాలు, ప్లాస్టిక్ వాటి ఉత్పత్తులు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో సౌదీ అరేబియాకు భారతదేశం రూ.10,727.65 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇది భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 2.38 శాతం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి