మెదక్ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్

రాష్ట్రంలో క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ఢిల్లీ ప్రార్థ‌న‌ల అంశం వెలుగులోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్ర‌వ్యాప్తంగా వైర‌స్ బాధితుల సంఖ్య ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.. ప్ర‌జ‌లు అన్ని జిల్లాల నుంచి ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన‌ట్లుగా తెలిసింది..

మెదక్ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Apr 01, 2020 | 9:42 AM

కోవిడ్‌-19ః ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతోంది. కరోనా పాజిటివ్ కేసులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణ‌లో క‌రోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 97 నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, మెదక్ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
రాష్ట్రంలో క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ఢిల్లీ ప్రార్థ‌న‌ల అంశం వెలుగులోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్ర‌వ్యాప్తంగా వైర‌స్ బాధితుల సంఖ్య ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.. ప్ర‌జ‌లు అన్ని జిల్లాల నుంచి ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన‌ట్లుగా తెలిసింది. వారిలో చాలా మందికి  క‌రోనా పాజిటివ్‌గా తేల‌టంతో మ‌రింత ఆందోళ‌నక‌ర ప‌రిస్థితి  నెల‌కొంది. వారంతా ఇన్ని రోజులు ఎక్క‌డున్నారు..ఎవ‌రెవ‌రీతో కాంటాక్ట్ అయ్యారు. వారి స‌న్నిహ‌తులు, బంధువులు, కుటుంబ స‌భ్యుల ప‌రిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అన్న వివ‌రాల‌పై ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆరా తీసింది. త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటోంది.
తాజాగా మెద‌క్ పట్టణంలోని అజాంపురా కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈయన ఢిల్లీ లో తబ్లిక్ జమాత్ కార్యక్రమానికి హాజరై గత 15 రోజుల క్రితం మెదక్ కు తిరిగి వచ్చిన వ్యక్తిగా గుర్తించారు. గాంధీ హాస్పిటల్ లో పరీక్షల అనంతరం సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్ గా వెల్లడించారు. ఇక ఈ ఇవాళ ఒక్క‌ రోజు మ‌రో 15 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారైన‌ట్లుగా తెలుస్తోంది.