శ్రీకాళహస్తిలో మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌లకు వెళ్లిన 15 మంది…రుయా ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

ఢిల్లీ మర్కజ్‌ నిజాముద్దీన్‌ సమావేశాలకు వెళ్లిన వారిలో చాలా మందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లుగా తేల‌టంతో ప్ర‌భుత్వాలు మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. కేవ‌లం ఒక్క‌ చిత్తూరు జిల్లా నుంచే 40 మంది ..

శ్రీకాళహస్తిలో మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌లకు వెళ్లిన 15 మంది...రుయా ఆస్ప‌త్రికి త‌ర‌లింపు
Follow us

|

Updated on: Apr 01, 2020 | 11:11 AM

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి సాగుతోంది. వైరస్ కట్టడికి ప్ర‌భుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టినా దావాన‌లంలా విస్త‌రిస్తోంది. మరణాలు, బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ఢిల్లీ మర్కజ్‌ నిజాముద్దీన్‌ సమావేశాలకు వెళ్లిన వారిలో చాలా మందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లుగా తేల‌టంతో ప్ర‌భుత్వాలు మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. కేవ‌లం ఒక్క‌ చిత్తూరు జిల్లా నుంచే 40 మంది మర్కజ్ వెళ్లిన‌ట్లుగా అధికారులు గుర్తించారు. వారి వివరాలను ఆరా తీస్తున్నారు.
చిత్తూరు జిల్లా నుంచి మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారిలో 28 మందిని గుర్తించారు.. వీరిని శ్రీకాళహస్తి, పీలేరు, పుంగనూరు, చిత్తూరు, కురబలకోట, పద్మావతి నిలయంలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు త‌ర‌లించారు..మిగిలిన వారిలో 15 మంది ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 15మంది శ్రీకాళహస్తిలో ఉన్నట్లు తేలింది.. వీరిని గుర్తించి వెంటనే వీరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. రుయా ఆస్పత్రిలో మంగళవారం ఒక్కరోజే 64 మందికి వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించారట. ఈ రిపోర్టులు బుధ, గురువారాల్లో వస్తాయని అధికారులు చెబుతున్నారు.
కాగా, ఢిల్లీ వెళ్లిన వారంతా త‌ప్ప‌క‌ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో జిల్లా వాసులు ఎవరికి వారుగా వ్యాధి నిర్థారణ పరీక్షల కోసం రుయాకు వ‌స్తున్నారు. మ‌రోవైపు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో ఇంటింటి సర్వే చేపడుతున్నారు అధికారులు. ఈ నేప‌థ్యంలోనే రుయా ఆస్పత్రిలో మంగళవారం ఒక్కరోజే 64 మందికి వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించారట. ఈ రిపోర్టులు బుధ, గురువారాల్లో వస్తాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా హైఅల‌ర్ట్ కొన‌సాగుతోంది. స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్