Power Bill: ఏపీ ప్రజలకు అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్.. భారీగా తగ్గనున్న కరెంట్ ఛార్జీలు.. ఒకేసారి ఎంతంటే..?
Current Bill: ఏపీలోని సామాన్యులు ఊరట చెందే నిర్ణయం కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకుంది. దీని వల్ల ఏపీలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గనున్నాయి. మార్చి నుంచి కరెంట్ ఛార్జీలు తగ్గనుండగా.. రాబోయే మూడేళ్లల్లో మరింత తగ్గింపు జరగనుంది. దీనిపై చంద్రబాబు ప్రకటన చేశారు.

Andhra News: సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తూ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఏపీలో కరెంట్ ఛార్జీలు మరింత తగ్గించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మార్చిలోగా కరెంట్ ఛార్జీలు మరింత తగ్గుతాయని, దీని వల్ల ప్రజలపై భారం తగ్గనుందని తెలిపారు. రాబోయే మూడేళ్లల్లో ఛార్జీలు మరింత తగ్గించనున్నట్లు ప్రకటించారు. ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఛార్జీలు పెంచమని, ఇంకా తగ్గిస్తామంటూ ప్రకటించి సీఎం చంద్రబాబు ప్రజలకు శుభవార్త అందించారు.
మార్చి నాటికి 10 పైసలు తగ్గింపు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మార్చి నాటికి విద్యుత్ ఛార్జీలు యూనిట్‌పై మరో 10 పైసలు తగ్గించనున్నట్లు ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు యూనిట్ విద్యుత్ ధర రూ5.19గా ఉంది. తమ ప్రభుత్వం ప్రస్తుతం తగ్గించి రూ.4.90కు తీసుకొచ్చిందన్నారు. మూడేళ్లలో యూనిట్ విద్యుత్ ధరను రూ.4కే అందించేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. 2019–24 కాలానికి చెందిన ట్రూఅప్ ఛార్జీలు రూ.4,498 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దీని వల్ల విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గనున్నాయి. దాదాపు యూనిట్‌కు 13 నుంచి 29 పైసలు తగ్గనుంది. ట్రైన్ డౌన్ మెకానిజం ద్వారా ఛార్జీలను తగ్గిస్తున్నామని, విద్యుత్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
అందరికీ బెనిఫిట్
విద్యుత్ ఛార్జీలు తగ్గడం ద్వారా సామాన్యులకే కాకుండా వ్యాపార వర్గాలకు కూడా లాభం జరగనుంది. చిన్న పరిశ్రమలు నడిపేవారు మరింత బెనిఫిట్ పొందనున్నారు. అటువైపు రైతులకు నాణ్యమైన కరెంట్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. దీని వల్ల వ్యవసాయ రంగం బలోపేతమవుతుందని అంటోంది. తమ ప్రభుత్వం నిర్ణయాల వల్ల రాష్ట్రంలో విద్యుత్ రంగం బలోపేతం అవుతుందని, తర్వాత ఆర్ధిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ ఛార్జీలు తక్కవగా ఉండటం వల్ల పరిశ్రమల విస్తరణకు అవకాశం ఉందని, దీని వల్ల ఉపాధి కూడా కలుగుతుందని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం ట్రూఆఫ్ ఛార్జీల వల్ల ప్రజలపై విద్యుత్ భారం వేసిందని, తమ ప్రభుత్వమే ఆ బకాయిలను భరిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
