క్రికెటర్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో లిటన్ దాస్ భార్య దేవశ్రీ బిశ్వాస్ సంచిత(27)కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. టీ పెట్టేందుకని వంట గదిలోకి వెళ్లిన ఆమె గ్యాస్ స్టవ్ ఆన్ చేయగానే..

బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో లిటన్ దాస్ భార్య దేవశ్రీ బిశ్వాస్ సంచిత(27)కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. టీ పెట్టేందుకని వంట గదిలోకి వెళ్లిన ఆమె గ్యాస్ స్టవ్ ఆన్ చేయగానే సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ముఖాన్ని రక్షించుకునే క్రమంలో చేతులు అడ్డం పెట్టుకోవడంతో తీవ్ర గాయాలైనట్టు కుటుంబసభ్యులు తెలిపారు. పేలుడు ధాటికి కిచెన్ కేబినెట్ కూలి ఆమెపై పడడంతో కాళ్లకి, చేతులకి, ముఖానికి గాయాలయ్యాయి. కాగా.. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా ఆమె ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగు చూసింది. తాను ఆ రోజు చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాంటూ.. జరిగిన వృత్తాంతాన్ని చెప్పుకొచ్చింది. అలాగే గ్యాస్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 2019లో ప్రపంచకప్ తర్వాత లిటన్ దాస్, దేవశ్రీల వివాహం జరిగింది.
ఇవి కూడా చదవండి:
భారత్‌లో ఒక్క రోజులోనే 45కి చేరిన మృతుల సంఖ్య
సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..
అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ
వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’
వాట్సాప్ నుంచే ఐసిఐసిఐ బ్యాంకు సేవలు
ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి
ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు