AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసభ్య పోస్టుల కేసు.. పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!

సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పెట్టిన శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో శనివారం(ఏప్రిల్ 19) విచారణకు హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న శ్రీ రెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అసభ్య పోస్టుల కేసు.. పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!
Sri Reddy Appeared At Pusapatirega Police Station
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Apr 19, 2025 | 5:08 PM

Share

సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పెట్టిన శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో శనివారం(ఏప్రిల్ 19) విచారణకు హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న శ్రీ రెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు.

కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కింతాడ కళావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 నవంబర్ 13న శ్రీ రెడ్డిపై కేసు సమోదు చేశారు. సోషల్ మీడియా X, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి శ్రీ రెడ్డి ఖాతాల్లో పోస్టుల ఆధారాలు సేకరించి పోలీసులకు ఆధారాలు అందజేశారు. దీంతో పోలీసులు శ్రీ రెడ్డిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అయితే తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ శ్రీ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు శ్రీ రెడ్డి పట్ల ఇబ్బందికరంగా వ్యవహరించవద్దని, విచారణ జరిపి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు నమోదయ్యాయి కాబట్టి 41ఏ నోటీసులు ఇవ్వాలని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఆదేశించింది హైకోర్టు. అంతే కాకుండా పోలీసుల విచారణకు సహకరించాలని శ్రీరెడ్డికి కూడా సూచించింది.

అలా హైకోర్టు ఆదేశాలతో శ్రీరెడ్డి పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లోని సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ముందు హాజరై విచారణ ఎదుర్కొన్నారు. పలు కీలక అంశాలపై సిఐ రామకృష్ణ శ్రీ రెడ్డిని విచారించారు. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి పెట్టిన పోస్టులు చూపించి ఇవి మీరు పెట్టినవేనా? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అనే అనేక రకాల ప్రశ్నలతో విచారణ జరిపారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే విచారణకు అవసరమైనప్పుడు మళ్లీ రావాలని, అందుబాటులో ఉండాలని చెప్పారు. అయితే శ్రీ రెడ్డి పై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరవ్వడం ఆసక్తిగా మారింది. కేసులు నమోదైన ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా విచారణకు హాజరవుతుందా? లేక న్యాయస్థానాల ద్వారా ఉపశమనం పొందుతుందా? అనే చర్చ నడుస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..