AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: చికెన్‌ ఇష్టంగా తినే వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌! ఇక మిమ్మల్ని ఆపేవారే లేరు..

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ లేదని ప్రభుత్వం ప్రకటించింది. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర నాయుడు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భోపాల్‌లోని జాతీయ సంస్థ నిర్ధారణతో, చికెన్ ప్రేమికులు ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇటీవల కోళ్ల మరణాలతో పెరిగిన భయాలను ప్రభుత్వం తొలగించింది.

Chicken: చికెన్‌ ఇష్టంగా తినే వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌! ఇక మిమ్మల్ని ఆపేవారే లేరు..
Chicken
SN Pasha
|

Updated on: Apr 19, 2025 | 3:36 PM

Share

చాలా మంది నాన్‌వెజ్‌ ప్రియులు ఇష్టంగా తినేది చికెన్‌. అధిక ప్రొటిన్‌తో పాటు నోటికి మంచి రుచికరంగా ఉంటుంది. అందుకే చాలా మంది చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లు కొందరుంటారు.. వీళ్లు చికెన్‌ను సరదాగా రోజూ తినేస్తారు. ఇలాంటి వాళ్లంతా కొంతకాలంగా గతం కంటే కాస్త తక్కువగా చికెన్‌ తింటున్నారు. మనసులో చికెన్‌ కుమ్మేయాలని ఉన్నా.. బర్డ్‌ ఫ్లూ భయంతో కాస్త తినడం తగ్గించారు. ఇటీవలె కాలంలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు సైతం పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే చికెన్ లవర్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టీ.దామోదర నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని భోపాల్‌లోని జాతీయ అత్యున్నత భద్రతా జంతు వ్యాధుల సంస్థ నిర్ధారించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించగా శాంపిల్స్ భోపాల్ పంపించి టెస్ట్ చేయించినట్లు చెప్పారు. పల్నాడులో బర్డ్ ఫ్లూ తో చిన్నారి మృతి చెందిన ప్రాంతంలో 70 మంది శాంపిల్స్ పరీక్షించగా నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. కాబట్టి నాన్‌వెజ్‌ ప్రియులు, ముఖ్యంగా చికెన్‌ అంటే లొట్టలేసుకునేవాళ్లు ఇక భయపడాల్సిన పనిలేదు. చికెన్‌ను ఇష్టమొచ్చినట్లు లాగించేయండి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్
దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్