AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డుపై కనిపించిన బ్యాగు.. ఓపెన్ చేసి చూడగా.. లచ్చిందేవి.. లచ్చిందేవి..!

అది గాజువాక.. నడిరోడ్డు.. ఓ వ్యక్తి తన కుమార్తెను స్కూల్ నుంచి ఇంటికి తీసుకు వస్తున్నాడు.. దారిలో ఓ సంచి కనిపించింది. అది కూడా చిరిగిపోయినట్టు ఉంది.. అనుమానాస్పదంగా కనిపించింది. దగ్గరకు వెళ్తే అందులో ఏముందో మరి..! పోనీలే అని వదిలేస్తే, ఆ సంచి పోగొట్టుకున్న వారి పరిస్థితి ఏంటి..? ఇదే ఆలోచించాడు ఆ వ్యక్తి.

రోడ్డుపై కనిపించిన బ్యాగు.. ఓపెన్ చేసి చూడగా.. లచ్చిందేవి.. లచ్చిందేవి..!
Bag On Road Side
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Apr 20, 2025 | 4:04 PM

Share

అది గాజువాక.. నడిరోడ్డు.. ఓ వ్యక్తి తన కుమార్తెను స్కూల్ నుంచి ఇంటికి తీసుకు వస్తున్నాడు.. దారిలో ఓ సంచి కనిపించింది. అది కూడా చిరిగిపోయినట్టు ఉంది.. అనుమానాస్పదంగా కనిపించింది. దగ్గరకు వెళ్తే అందులో ఏముందో మరి..! పోనీలే అని వదిలేస్తే, ఆ సంచి పోగొట్టుకున్న వారి పరిస్థితి ఏంటి..? ఇదే ఆలోచించాడు ఆ వ్యక్తి. మనకెందుకులే మన దారిన మన పోదాం అని అనుకున్నాడో ఒకానొక సమయంలో.. మనది కాని వస్తువు కోసం మనం ఎందుకు ఆలోచించాలి.. అయినా ఎవరిదో ఈ యాచకుడిది అయి ఉంటుంది అని అనుకున్నాడు. కానీ.. వెళ్లిపోయే క్రమంలో ఆగాడు. దగ్గరకు వెళ్ళాడు.. సంచిని అటూ ఇటూ కదిపాడు. మెల్లగా తెరిచి చూశాడు.. వామ్మో.. లోపల కనిపించిన ఆ దృశ్యానికి ఆ వ్యక్తి షాక్..! వెంటనే ఆ సంచి పట్టుకుని తిన్నగా అక్కడికి వెళ్ళాడు..!

వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం యాదవ జగ్గరాజుపేటకు చెందిన షణ్ముఖ కుమార్.. హిటాచి ఎటిఎం సెంటర్ నిర్వహిస్తున్నాడు. దానికోసం అప్పుడప్పుడు నగదు డ్రా చేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గాజువాక వెళ్ళాడు షణ్ముఖ కుమార్. ఈ క్రమంలోనే బ్యాంకు నుంచి 3.60 లక్షల రూపాయలు విత్‌డ్రా చేసి.. ఓ సంచిలో పెట్టుకున్నాడు. అక్కడ నుంచి మోటార్ బైక్‌పై బయలుదేరాడు షణ్ముఖ కుమార్. కొంత దూరం వెళ్ళాక చూసేసరికి అతని బ్యాగు కనిపించలేదు. దీంతో గుండెలు పట్టుకున్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ జరిగిన విషయాన్ని చెప్పాడు.

పోలీసులు దర్యాప్తునకు సిద్ధమవుతున్న తరుణంలో.. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ వచ్చాడు. తనకు భారీగా డబ్బులు దొరికాయని కొంతమంది సిబ్బందికి చెప్పాడు. కానీ వాళ్లు నమ్మలేకపోయారు. నగదుతో కూడిన ఆ సంచిని టేబుల్ పై పెట్టాడు కొర్ల శివకుమార్. తనకు ఆ బ్యాగు నడిరోడ్డుపై దొరికిందని, తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. అప్పటికే షణ్ముఖ కుమార్ తన నగదు సంచిపోయిందని చెప్పడంతో పోలీసులు.. శివకుమార్ తీసుకువచ్చిన సంచి అతనిదేనని గుర్తించారు. నగదు సంచిని షణ్ముఖ కుమార్ కు అప్పగించారు గాజువాక సీఐ పార్థసారథి. శివకుమార్ నిజాయితీని పోలీసులు అభినందించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు