AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canada: కెనడాలో కాల్పుల మోత.. భారతీయ విద్యార్థిని మృతి!

పై చదువుల కోసం వెళ్లిన ఇండియన్ స్టూడెంట్ కెనడాలో తుపాకుల తూటాలకు బలయ్యింది. కెనడాలోని ఒంటారియాలో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని హర్సిమ్రత్ రాంధావా మృతి చెందినట్లు టొరంటోలోని ఇండియన్‌ ఎంబసీ ధృవీకరించింది.

Canada: కెనడాలో కాల్పుల మోత.. భారతీయ విద్యార్థిని మృతి!
Gun Culture In Canada
Anand T
|

Updated on: Apr 19, 2025 | 12:50 PM

Share

విదేశాల్లో రోజురోజుకు గన్‌ కల్చర్‌ పెరిగిపోతుంది. ఈ గన్‌ కల్చర్‌తో స్థానిక అమాయక ప్రజలతో పాటు, అక్కడికి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు, పర్యాటకానికి వచ్చిన పర్యాటకులు సైతం బలవుతున్నారు. తాజాగా కెనడాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని మరణించింది. భారత్‌ కు చెందిన విద్యార్థిని హర్సిమ్రత్ రాంధావా బస్టాప్ లో బస్సుకోసం ఎదురుచూస్తుండగా.. ఇంతలో అక్కడి వచ్చిన ఇద్దరు కారు డ్రైవర్లు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ క్రమంలో వారి గన్‌లోంచి వచ్చిన ఓ బుల్లెట్ బస్టాప్‌లో ఉన్న హర్సిమ్రత్‌కు తగలడంతో ఆమె మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం…

ఒంటారియోలోని హామిల్టన్‌లోని మోహాక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని హర్సిమ్రత్ రాంధావా ఉద్యోగానికని వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానకి చేరుకునేటప్పటికీ హర్సిమ్రత్ బుల్లెట్ గాయంతో పడిపోయి ఉందని..ఆమెను స్థానికి హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే తను చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించినట్టు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు. నల్లటి కారులో కూర్చున్న వ్యక్తి హర్‌సిమ్రత్‌ను కాల్చి చంపి అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థిని హర్సిమ్రత్ రాంధావా మృతి పట్ల భారత కాన్సులేట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తూ, ఆమె డెడ్‌బాడీన్ని ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చింది.

గత నాలుగు నెలల్లో కెనడాలో మరణించిన భారతీయుల..

అయితే గత నాలుగు నెలల్లో నలుగురు భారతీయులు హత్యకు గురైనట్టు తెలుస్తోంది. గత నాలుగు నెలల్లో కెనడాలో జరిగిన వేర్వేరు సంఘటనలలో ముగ్గురు భారతీయులు మరణించిగా..తాజాగా జరిగిన కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థిని మృతి చెందింది. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన 22 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి గురాసిస్ సింగ్‌ను తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత అదే రాష్ట్రం పంజాబ్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థిని రితికా రాజ్‌పుత్, స్నేహితులతో కలిసి అర్థరాత్రి భోగి మంటలు పెండుతుండగా చెట్టు కూలి మరణించింది. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 6న ఎడ్మంటన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 20 ఏళ్ల భారత సంతతికి చెందిన హర్ష్‌దీప్ సింగ్‌ అనే వ్యక్తి ఓ ముఠా కాల్చి చంపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…