లాక్‌డౌన్ః కరీంనగర్‌లో నక్షత్ర తాబేళ్లతో గుట్టుగా..
కరీంనగర్ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నక్షత్ర తాబేళ్ల వ్యాపారం గుట్టురట్టు చేశారు పోలీసులు. .

ఓ వైపు దేశం మొత్తం లాక్‌డౌన్ నడుస్తోంది.తెలంగాణలో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. కానీ, మూగజీవాలతో అక్రమ వ్యాపారం చేస్తున్న కొందరు కేటుగాళ్లు మాత్రం నిబంధనలకు నీళ్లోదులుతూ..యద్దేచ్చగా తమ కార్యకలాపాలు కానిచేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నక్షత్ర తాబేళ్ల వ్యాపారం గుట్టురట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే…
కరీంనగర్‌లోని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న సుధాకర్ అనే వ్యక్తి అధికారుల కళ్లుగప్పి నక్షత్ర తాబేళ్ల వ్యాపారం సాగిస్తున్నాడు..గతంలో డాగ్‌ఫామ్ నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే సుధాకర్ వద్ద నక్షత్ర తాజేళ్లు ఉన్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు..తనిఖీలు నిర్వహించారు. అతడి ఇంట్లో లభించిన రెండు నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సుధాకర్‌ని విచారించగా, అవి వేరే వాళ్లవని..కొద్దిరోజులు మా వద్ద వదిలివెళ్లారంటూ చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. సుధాకర్ మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..నక్షత్ర తాబేళ్లను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
