తండ్రిగా ప్రమోషన్.. కట్‌చేస్తే.. జహీర్ ఖాన్‌కు పెన్షన్ ఎంతో తెలుసా?

TV9 Telugu

18th April 2025

IPL 2025 సమయంలో తండ్రిగా మారిన జహీర్ ఖాన్ కు BCCI ఎంత పెన్షన్ ఇస్తుందో తెలుసా? 

జహీర్‌కు ఎంత పెన్షన్ వస్తుంది?

టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌కు బీసీసీఐ నుంచి రూ.60,000 పెన్షన్ అందుతుంది. 

రూ. 60000 పెన్షన్

జహీర్ ఖాన్ టీమిండియా తరపున ఆడిన మాజీ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్. అతను దేశం తరపున 169 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 

169 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు

జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. 

టీమిండియాకు ప్రాతినిధ్యం

జహీర్ ఖాన్ గతంలో పొందుతున్న పెన్షన్ మొత్తం రూ. 37,500. కానీ 2022 సంవత్సరంలో బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ల పెన్షన్‌ను పెంచింది. 

2022లో పెరిగిన పెన్షన్

జహీర్ ఖాన్ ప్రస్తుతం IPL 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అతను లక్నో జట్టుకు బౌలింగ్ కోచ్.

లక్నోతో అనుబంధం

IPL 2025 సమయంలో జహీర్ ఖాన్ తండ్రి అవుతున్నాడనే సమాచారం అతని భార్య ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నుంచి అందింది. 

తండ్రైన జహీర్