AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shine Tom Chacko: డ్రగ్స్ కేసులో అరెస్ట్.. టాలీవుడ్ నటుడికి బెయిల్..

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఉదయం టామ్‌చాకోను నాలుగు గంటల పాటు పోలీసులు విచారించారు. డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలతోపాటు మాదకద్రవ్యాల వినియోగం, కుట్ర కింద అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తాను డ్రగ్స్‌ తీసుకోలేదంటున్నాడు చాకో.

Shine Tom Chacko: డ్రగ్స్ కేసులో అరెస్ట్.. టాలీవుడ్ నటుడికి బెయిల్..
Shine Tom Chacko
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2025 | 8:31 PM

Share

దసరా సినిమా విలన్‌ , మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకోను డ్రగ్స్‌ కేసులో కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్నాకుళం నార్త్‌ పోలీసు స్టేషన్‌లో నాలుగు గంటల పాటు విచారించిన తరువాత టామ్‌ చాకోను అదుపు లోకి తీసుకున్నారు. NDPS చట్టం కింద టామ్‌ చాకోను అరెస్ట్‌ చేశారు. అయితే కోర్టులో చాకోకు ఊరట లభించింది. కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో పోలీసులు ఆయన్ను విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితమే టామ్‌ చాకోపై నటి విన్సీ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు . డ్రగ్స్‌ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశారు. కొచ్చి లోని ఓ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతోందని సమాచారం రావడంతో పోలీసులు రైడ్‌ చేశారు. అయితే పోలీసులు రాకముందే మూడో అంతస్తులో ఉన్న చాకో కిటికీ నుంచి కిందకు దూకి పారిపోయాడు.. చాకో పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. విచారణకు హాజరుకావాలని అతడికి సమన్లు జారీ చేసిన పోలీసులు తరువాత అరెస్ట్‌ చేశారు. తెలుగులో దసరా సినిమాలో విలన్‌గా నటించాడు షైన్‌ టామ్‌ చాకో.

బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజు సినిమాలో కూడా చాకో నటించాడు. హోటల్‌లో షైన్‌ చాకోకు డ్రగ్స్‌ సప్లై చేసిన నజీర్‌ అనే డ్రగ్‌ పెడ్లర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. ఆ రోజు ఇద్దరి మధ్య 20 వేల లావాదేవీలు జరిగినట్టు దర్యాప్తులో తేలింది. అయితే తాను డ్రగ్స్‌ తీసుకోలేదని చాకో చెబుతున్నాడు. హోటల్‌ నుంచి ఎందుకు పారిపోయారని పోలీసులు ప్రశ్నిస్తే , తనపై కొందరు గూండాలు దాడి చేస్తారన్న భయంతో అక్కడి నుంచి పారిపోయినట్టు సమాధానం చెప్పాడు.

షైన్ టామ్ చాకో తెలుగులో దసరా సినిమాతో పాపులర్ అయ్యాడు. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..