కరోనా వైరస్: ప్రపంచంలో టాప్ 10 హై రిస్క్ అండ్ సేఫ్ కంట్రీస్ ఇవే!

ప్రపంచాన్ని 'కరోనా వైరస్' మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఎన్ని రకాలుగా ఎటువంటి చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయడం కష్టతరమవుతోంది. రోజురోజుకీ.. మరింత విజృంభిస్తూనే ఉంది. కాగా ప్రజలు అత్యంత సురక్షితమైన, అత్యంత ప్రమాదకరమైన దేశాల..

కరోనా వైరస్: ప్రపంచంలో టాప్ 10 హై రిస్క్ అండ్ సేఫ్ కంట్రీస్ ఇవే!
Follow us

| Edited By:

Updated on: Apr 01, 2020 | 10:51 AM

‘కరోనా మహమ్మారి’ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎన్ని రకాలుగా ఎటువంటి చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయడం కష్టతరమవుతోంది. రోజురోజుకీ.. మరింత విజృంభిస్తూనే ఉంది. కాగా.. ప్రజలు అత్యంత సురక్షితమైన, అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాను సీఎన్ఎన్ ప్రచురించింది. ఈ విషయాన్ని వైసీపీ నేత పీవీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘మన దేశం సురక్షితమైన దేశాల సరసన లేకపోయినా, ప్రమాదకరమైన దేశంగా పేర్కొన లేదు. ప్రభుత్వం మరియు యంత్రాంగం మన దేశాన్ని సురక్షితమైన మరియు సమర్ధవంతమైన దేశంగా మలచాలని ప్రతి పౌరుని కోరిక ! జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు.

ఇక సీఎన్ఎస్ వెల్లడించిన వివరాల మేరకు అత్యంత ప్రమాదకర దేశాల్లో తొలి మూడు స్థానాల్లో ఇటలీ, ఇండొనేషియా, స్పెయిన్ ఉండగా.. ఆ తర్వాత స్థానంలో ఇరాక్, ఇరాన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, యూఎస్ఏ, యూకే, ఫిలిప్పీన్స్‌ దేశాలు ఉన్నాయి.

సురక్షితమైన దేశాలు: ఇజ్రాయిల్, సింగపూర్, స్లోవేకియా, న్యూజిలాండ్, హాంకాంగ్, తైవాన్, హంగేరి, ఆస్ట్రియా, జర్మనీ, గ్రీన్ ల్యాండ్‌లు ఉన్నాయి.

ఇదే సమయంలో కరోనా వ్యాధి సోకితే అత్యుత్తమ చికిత్సా విధానాలు ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే.. సింగపూర్, సౌత్ కొరియా, హాంకాంగ్, చైనా, జపాన్, జర్మనీ, ఆస్ట్రియా, యూఏఈ, బెహరై, తైవాన్ దేశాలు ఉన్నాయి.

ఇక భారతదేశం.. ప్రమాదకర జాబితాలోనూ లేదు. సురక్షితమైన దేశాల్లోనూ లేదు. కాబట్టి ఇది మరింత డేంజరస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటికే కరోనా వైరస్ మరింత ప్రబలుతూనే ఉంది. దీని బట్టి కేసులు ఎక్కువై ప్రమాదకర స్థితిలోకి వెళ్లినా అతిశయోక్తి లేదు.

ఇవి కూడా చదవండి:

కరోనా దెబ్బ.. మోదీ సర్కార్ భారీ అప్పు

లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు

వైన్స్‌‌ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్

క్రికెటర్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

భారత్‌లో ఒక్క రోజులోనే 45కి చేరిన మృతుల సంఖ్య

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..

అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ

వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’