Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సి.ఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు. కంటైన్మేంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్మంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ కేసు. కేజీహెచ్ లో రెండో రోజు ముగిసిన సీబీఐ విచారణ. కేజీహెచ్ వైద్యాధికారులతో మాట్లాడిన సీబీఐ అధికారి. సీసీ ఫుటేజీని పరిశీలించిన సీబీఐ. 16 న క్యాజువాల్టీలో డాక్టర్ సుధాకర్ కు పరీక్షలు చేసిన కేజీహెచ్ వైద్యులు.
  • ఢిల్లీ లో కరోనా విజృంభన. ఢిల్లీ లో కొత్తగా 1295 కరోనా పాజిటివ్ కేస్ లు ,13 మంది మృతి. ఢిల్లీ రాష్ట్రంలో 19844 కి చేరిన కరోనా కేసులు నమోదు. 473 మంది కరోనా తో మృతి
  • రుతుపవనాలు ఇంకా కేరళ తీరానికి తాకలేదు. దీని పై మేము క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తున్నాం. జూన్ 1 నుండి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అనుకుంటున్నాం. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ సమీపంలో ఈ రోజు అల్ప పీడనం ఏర్పడింది. జూన్ 2 కి తుఫానుగా మారుతుందని మేము అనుకుంటున్నాం. జూన్ 3 సాయంత్రం నాటికి గుజరాత్ ,ఉత్తర మహారాష్ట్ర తీరం వైపుకు చేరుకుంటుంది. మృత్యుంజయ్ మోహపాత్రా, ఢిల్లీ IMD.
  • జమ్మూ కాశ్మీర్‌లో సీనియర్ ఐఎఎస్ అధికారి కి కరోనా పాజిటివ్‌. ఆయనతో పాటు సమావేశానికి హాజరైన పలువురు అధికారులు,వైద్యులను హోమ్ క్వారంటైన్ లో వెళ్లాలని సూచన.
  • మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ ప్లాన్‌ను ట్రాయ్ సిఫారసు చేసినట్లు కొన్ని మీడియా సంస్థల లో వార్తలు వచ్చాయి. TRAI సిఫారసు ప్రకారం,దేశం లో 10-అంకెల నెంబర్ కొనసాగుతుంది. మేము 11-అంకెల నంబరింగ్ ప్లాన్‌కు మార్చడాన్ని ఖండిస్తున్నాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.

లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకపోవడమేమో కానీ.. కొత్త సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన ఉద్యోగులు, రోజువారి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ ఉండలేక.. తమ స్వగ్రామాలకు వెళ్లలేక తీవ్ర అవస్థలు..
Odisha government approves Rs. 54 lakh, లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో దాదాపు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. ఈ చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకపోవడమేమో కానీ.. కొత్త సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన ఉద్యోగులు, రోజువారి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ ఉండలేక.. తమ స్వగ్రామాలకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు నోరు లేని జీవాలు పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా ఉంది. వాటిని పట్టించుకునే నాథుడు లేక ఆకలితో అలమటించి మృత్యువాత పడుతున్నాయి.

Odisha government approves Rs. 54 lakh, లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు

ఈ క్రమంలో వాటిని ఆదుకోవడానికి ఒడిశా ప్రభుత్వం రూ.54 లక్షల నిధులను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కేటాయించారు. కుక్కలు, పిల్లులు, కోతులు వంటి జంతువులకు ఆహారాన్ని అందించేందుకుగానూ ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చనుంది. వాటికి కడుపునిండా ఆహారం అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని.. ఒడిశా సీఎం తెలిపారు. జంతువులకు ఆహారం అందించేలాగా ఈ నిధులను ప్రాంతాలవారీగా కేటాయించనున్నారు. ముందుగా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ మున్సిపాల్ కార్పొరేషన్‌కు ప్రతీ రోజూ రూ.20 వేలను అందించనున్నారు. అలాగే కటక్, బెర్హం పూర్, రూర్కెలా, సంబల్ పూర్ వంటి మేజర్ పట్టణాలకు రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నారు. ఇక మిగిలిన మున్సిపాలిటీలన్నింటికీ రూ.5000 చొప్పున నిధులు కేటాయించనున్నామని అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: వైన్స్‌‌ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్

క్రికెటర్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

భారత్‌లో ఒక్క రోజులోనే 45కి చేరిన మృతుల సంఖ్య

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..

అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ

వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’

Related Tags