Tollywood: వావ్.. ఎంతలా మారిపోయింది? టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
ఈ అమ్మడు సినిమాల్లోకి రాక ముందే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన ఇన్ స్టా గ్రామ్ వీడియోలు, రీల్స్ తో గ్లామరస్ బ్యూటీగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందీ అందాల తార.

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి టాలీవుడ్ లో బాగా ఫేమస్. అలాగనీ ఈ అమ్మాయి హీరోయిన్ కూడా కాదు. కనీసం ఒక్క సినిమాలోనూ కూడా నటించలేదు. అయితేనేం ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన గ్లామరస్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలతో నెట్టింట ఈ అమ్మడు చేసే అరాచకం మాములుగా ఉండదు. ముఖ్యంగా తన తల్లితో కలిసి ఈ క్యూటీ చేసే డ్యాన్స్ వీడియోలు, పోస్టులకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. అప్పుడప్పుడు నెగెటివ్ కామెంట్స్ వచ్చినా ‘ఐ డోన్డ్ కేర్’ అంటూ తనకు నచ్చింది చేసుకుంటూ ముందుకెళ్లిపోతోన్నారీ తల్లీ కూతుళ్లు. అన్నట్లు ఈ స్టార్ కిడ్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తన తల్లి అడుగు జాడల్లోనే నడుస్తూ హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు సీనియర్ నటీమని సురేఖా వాణి కూతురు సుప్రిత.
ఇప్పటికే సెలబ్రిటీ డాటర్ గా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సుప్రిత ఇప్పుడు ఓ సినిమాలో నటిస్తోంది. బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ చౌదరి ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటోంది సుప్రిత.
ఐపీఎల్ మ్యాచుల్లో ఎంజాయ్ చేస్తోన్న సుప్రిత..
Falling for this man over and over ❤️💙🥺🧿@imVkohli @RCBTweets #CSKvRCB pic.twitter.com/cwLtRVLwfD
— Bandaru Sheshayani Supritha (@_supritha_9) March 29, 2025
కాగా ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సురేఖా వాణి, సుప్రితల పేర్లు కూడా వినిపించాయి. గతంలో వీరు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు ఈ తల్లీ కూతుళ్లు కూడా అంగీకరించారు. అయితే ప్రస్తుతం అలాంటి పనులేమీ చేయడం లేదంటూ ఆ మధ్యన ఒక వీడియో రిలీజ్ చేశారు.
హోలీ వేడుకల్లో..
Happy Holi 🙏🏻❤️ Don’t encourage betting apps 🫵🏻 pic.twitter.com/Kf7HnSELky
— Bandaru Sheshayani Supritha (@_supritha_9) March 14, 2025
తన మొదటి సినిమా హీరో అమర్ దీప్ చౌదరితో సుప్రిత.. వీడియో
Kissik ❤️🔥#Kissik #Pushpa2 pic.twitter.com/MVqo8Kk3hk
— Bandaru Sheshayani Supritha (@_supritha_9) November 27, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..