లాక్‌డౌన్ః సెల్‌ఫోన్ కొనివ్వలేదనే మనస్తాపంతో ..
ఓ కొడుకు తన తండ్రిని సెల్‌ఫోన్ కొనివ్వమని అడిగాడు. అందుకు అంగీకరించిన తండ్రి కూడా సరేనన్నాడు. కానీ, ఎక్కడా మొబైల్ షాప్స్ అందుబాటులో లేకపోవడంతో తర్వాత కొనిస్తానని అని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ కొడుకు ..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. నిత్యవసర సరుకులు, వస్తువులు తప్ప ఏవీ అందుబాటులో లేవు. ఇటువంటి సమయంలో ఓ కొడుకు తన తండ్రిని సెల్‌ఫోన్ కొనివ్వమని అడిగాడు. అందుకు అంగీకరించిన తండ్రి కూడా సరేనన్నాడు. కానీ, ఎక్కడా మొబైల్ షాప్స్ అందుబాటులో లేకపోవడంతో తర్వాత కొనిస్తానని అని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..జిల్లాలోని చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన ముదాం ప్రశాంత్ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 10వ తరగతి చదువుతున్న ప్రశాంత్…సెల్‌ఫోన్ కావాలని తండ్రిని అడిగాడు. అయితే, కరోనా నేపథ్యంలో షాపులు తెరవగానే కొనిస్తానని చెప్పాడు వాళ్ల నాన్న. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్.. తమ వ్యవసాయ భూమిలోనే చెట్టుకు ఉరివేసుకున్నాడు. ప్రశాంత్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.