ప్రభాస్ కంటే ముందు ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. అసలు విషయం చెప్పిన మారుతి
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ది రాజాసాబ్. రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనన్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మారుతి. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మారుతి. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోల ఇమేజ్ కంటే కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, ప్రేక్షకుడిగా తాను ఒక హీరోని ఎలా చూడాలనుకుంటానో అదే సినిమాలో చూపిస్తానని.. ఈ విధానం కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు అన్నారు మారుతి.
తన విజయవంతమైన చిత్రం మహానుభావుడు వెనుక ఉన్న ఆలోచనను పంచుకున్నారు. 2012-13లో ఒక OCD ఉన్న వ్యక్తి వైరస్ కారణంగా ప్రేమలో ఎలా ఇబ్బంది పడతాడు అనే ఆలోచనతో మొదలైందని, అయితే ఆ తర్వాత కథను విలేజ్ నేపథ్యానికి మార్చి శర్వానంద్ మాస్ అప్పీల్‌ను పెంచడానికి ఉపయోగపడిందని అన్నారు మారుతి. సాయి ధరమ్ తేజ్ తో ప్రతిరోజు పండగే సినిమా గురించి మాట్లాడుతూ.. చిత్రలహరి తర్వాత ఫ్లాప్‌లతో సతమతమవుతున్న తేజ్ కు, ఆయన వ్యక్తిత్వానికి సరిపోయే మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథ చెప్పాలని భావించి, ప్రతిరోజు పండగే పాయింట్‌ను చెప్పినట్లు తెలిపారు మారుతి. తేజ్ వ్యక్తిత్వం, ఇతరులను గౌరవించే స్వభావం, తన తండ్రి ఆసుపత్రిలో ఉన్నప్పుడు శర్వానంద్ చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నారు మారుతి.
పెద్ద హీరోలతో సినిమా చేయడానికి ఎక్కువ సమయం ఎందుకు తీసుకున్నారో మారుతి వివరించారు. మిడ్‌రేంజ్ హీరోలతో పనిచేసి, తనను తాను నిరూపించుకున్న తర్వాతే పెద్ద స్థాయికి వెళ్లాలని భావించానని అన్నారు మారుతి. అల్లు అర్జున్ తో ఒక సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ నచ్చినప్పటికీ, సుకుమార్ పుష్ప ప్రాజెక్ట్ రావడంతో అది వాయిదా పడిందని, తాను వేచి ఉండకుండా వెంటనే ప్రతిరోజు పండగే కథతో ముందుకు వెళ్ళానని చెప్పారు. ఖాళీగా ఉండటం ఇష్టం లేదని, దివంగత దర్శకుడు కోడి రామకృష్ణగారిలా తాను ఎప్పుడూ పనిలోనే బిజీగా ఉంటానని అన్నారు . పక్కా కమర్షియల్ సినిమా గురించి మాట్లాడుతూ, ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేవలం ఒక్క రోజు మాత్రమే నిరుత్సాహం ఉంటుందని, కొత్త పాయింట్ దొరికిన వెంటనే తిరిగి శక్తి వస్తుందని అన్నారు మారుతి. ముఖ్యంగా సినిమా సెకండ్ ఆఫ్, క్లైమాక్స్ పై పూర్తి అవగాహన లేకుండా షూటింగ్‌కు వెళ్లడం అనేక సమస్యలకు దారితీస్తుందని, తన గత చిత్రాలైన బాబు బంగారం, కొత్త జంట, శైలజారెడ్డి అల్లుడు, పక్కా కమర్షియల్ ల విషయంలో ఇలాంటి పొరపాట్లు జరిగాయని అన్నారు మారుతి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
