AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: మిథాలీ రాజ్‌ రికార్డ్‌కే చెమటలు పట్టించిన లేడీ కోహ్లీ.. సరికొత్త ప్రపంచ రికార్డ్

India vs Sri Lanka Women's T20 2025: ఆదివారం తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన 4వ టీ20లో భారత బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన భారీ ప్రపంచ రికార్డును సృష్టించింది. 29 ఏళ్ల ఈమె అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10,000 పరుగులు నమోదు చేసి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న మహిళగా నిలిచింది. ఆమె భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను అధిగమించి , కేవలం 280 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకుంది.

Team India: మిథాలీ రాజ్‌ రికార్డ్‌కే చెమటలు పట్టించిన లేడీ కోహ్లీ.. సరికొత్త ప్రపంచ రికార్డ్
Smriti Mandhana World Record
Venkata Chari
|

Updated on: Dec 29, 2025 | 8:46 AM

Share

Smriti Mandhana World Record: భారత మహిళా క్రికెట్ సంచలనం స్మృతి మంధాన తన కెరీర్‌లో మరో అపురూపమైన మైలురాయిని చేరుకుంది. ఆదివారం శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆమె కేవలం ఒకే ఇన్నింగ్స్‌తో అనేక రికార్డులను తిరగరాసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేయడమే కాకుండా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రీడాకారిణిగా దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ స్మృతి మంధాన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోనుంది. శ్రీలంక బౌలర్లను ఆడుకుంటూ ఆమె చేసిన విధ్వంసం భారత జట్టుకు భారీ విజయాన్ని అందించడమే కాకుండా, వ్యక్తిగత రికార్డుల పంట పండించింది.

వేగవంతమైన 10,000 పరుగులు..

ఈ మ్యాచ్‌కు ముందు స్మృతి మంధాన 10,000 పరుగుల మైలురాయికి కేవలం 27 పరుగుల దూరంలో ఉంది. ఇన్నింగ్స్ 7వ ఓవర్లో సింగిల్ తీయడం ద్వారా ఆమె ఈ అరుదైన ఘనతను అందుకుంది. కేవలం 281 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును చేరుకోవడం ద్వారా.. గతంలో మిథాలీ రాజ్ (291 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును స్మృతి అధిగమించింది.

అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ క్రీడాకారిణిగా, ప్రపంచవ్యాప్తంగా నాలుగో ప్లేయర్‌గా (మిథాలీ రాజ్, సుజీ బేట్స్, షార్లెట్ ఎడ్వర్డ్స్ తర్వాత) స్మృతి రికార్డు సృష్టించింది.

రికార్డు భాగస్వామ్యం..

కేవలం వ్యక్తిగత రికార్డులే కాకుండా, షఫాలీ వర్మతో కలిసి స్మృతి మంధాన మొదటి వికెట్‌కు 162 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మహిళల టీ20ల్లో ఏ వికెట్‌కైనా భారత్ తరపున ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. స్మృతి 48 బంతుల్లో 80 పరుగులు (11 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయగా, షఫాలీ 79 పరుగులు చేసింది.

  • 2025లో స్మృతి ప్రభంజనం: ఈ ఏడాది (2025) స్మృతి మంధానకు అద్భుతంగా గడిచింది.
  • ఆమె ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది.
  • ప్రపంచకప్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి, ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత మహిళగా రికార్డు సృష్టించింది.
  • మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీలు చేసిన తొలి భారతీయ మహిళగా కూడా చరిత్ర నిలిచింది.

స్మృతి మంధాన ఫామ్ చూస్తుంటే మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (10,868) ఆల్‌టైమ్ రికార్డును కూడా ఆమె త్వరలోనే అధిగమించేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ విజయంతో భారత్ శ్రీలంకపై 4-0తో సిరీస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..