AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా 24 క్యారెట్ల గోల్డ్ అతనే.. దేవుడు వరం ఇస్తే నేను కోరుకునేది అదే: సిద్ధూ సంచలన వ్యాఖ్యలు

Navjot Singh Sidhu Key Comments on Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు. రెండు సెంచరీలు సాధించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 302 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మారాడు. ఈ సిరీస్‌కు ముందు, కోహ్లీ ఒకే ఫార్మాట్‌లో చురుగ్గా ఉన్నందున అతని ఫామ్‌పై చాలా మంది ఊహాగానాలు చేశారు. అయితే, 37 ఏళ్ల అతను ప్రోటీస్‌పై తన అద్భుతమైన ప్రదర్శనతో విమర్శకులందరినీ సైలెంట్ చేశాడు.

టీమిండియా 24 క్యారెట్ల గోల్డ్ అతనే.. దేవుడు వరం ఇస్తే నేను కోరుకునేది అదే: సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
Team India
Venkata Chari
|

Updated on: Dec 29, 2025 | 9:09 AM

Share

Navjot Singh Sidhu Key Comments on Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం అభిమానులే కాదు, మాజీ దిగ్గజాలు సైతం అతని ఆటతీరుకు ఫిదా అవుతుంటారు. తాజాగా టీమ్ ఇండియా మాజీ ఓపెనర్, తనదైన శైలిలో అలరించే నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. కోహ్లీని “24 క్యారెట్ల బంగారం” అని అభివర్ణించడమే కాకుండా, దేవుడు తనకు ఒక వరం ఇస్తే ఏం కోరుకుంటారో చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడనే విషయం తెలిసిందే. అతని ఫిట్‌నెస్, పరుగుల దాహం, మైదానంలో చూపించే దూకుడు అతడిని మిగిలిన వారికంటే భిన్నంగా నిలబెడుతుంది. ఇదే విషయాన్ని నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఒక ఇంటర్వ్యూలో నొక్కి చెప్పాడు.

ఇది కూడా చదవండి: టీ20 వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. కట్‌చేస్తే.. టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?

ఇవి కూడా చదవండి

దేవుడు వరం ఇస్తే అదే కోరుకుంటా: సిద్ధూ మాట్లాడుతూ.. “ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై నన్ను ఒక వరం కోరుకోమంటే, నేను నా యవ్వనాన్ని లేదా నా సంపదను కోరుకోను. నేను మళ్ళీ పుట్టి విరాట్ కోహ్లీలా క్రికెట్ ఆడాలని కోరుకుంటాను. అతనిలో ఉన్న అంకితభావం, క్రమశిక్షణ అసాధారణం” అని వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఆటను చూడటం ఒక అద్భుతమైన అనుభవమని ఆయన పేర్కొన్నాడు.

24 క్యారెట్ల బంగారం: కోహ్లీని సిద్ధూ కేవలం గొప్ప ఆటగాడిగానే కాకుండా ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా అభివర్ణించాడు. “విరాట్ కోహ్లీ 24 క్యారెట్ల బంగారం లాంటివాడు. కాలం మారుతున్నా, తరాలు మారుతున్నా అతని విలువ తగ్గదు. అతను క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టులో భయం మొదలవుతుంది. తన బ్యాట్‌తో సమాధానం చెప్పడం కోహ్లీకి అలవాటు. అతను రికార్డుల కోసం ఆడడు, జట్టు విజయం కోసమే ఆడతాడు, కానీ ఆ క్రమంలో రికార్డులే అతడిని వెతుక్కుంటూ వస్తాయి” అని సిద్ధూ ప్రశంసించాడు.

ఇది కూడా చదవండి: Team India: టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా యువ సంచలనం.. సూర్యకుమార్‌పై వేటు.. గిల్‌కు నో ఛాన్స్.?

కోహ్లీలోని ప్రత్యేకత: సిద్ధూ విశ్లేషణ ప్రకారం.. కోహ్లీ గొప్పతనం కేవలం అతని బ్యాటింగ్‌లోనే లేదు, అతని మానసిక దృఢత్వంలో ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని దరిచేరనీయకుండా మ్యాచ్‌ను గెలిపించే సత్తా కోహ్లీ సొంతం. ముఖ్యంగా ఛేజింగ్ సమయంలో కోహ్లీ ప్రదర్శించే ఏకాగ్రతను చూసి ప్రతి యువ క్రికెటర్ నేర్చుకోవాలని సిద్ధూ సూచించాడు.

ఇది కూడా చదవండి: Team India: ద్రవిడ్ హయాంలో తోపు ఫినిషర్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌గా మార్చిన గంభీర్..

నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “కింగ్ కోహ్లీ” పట్ల సిద్ధూకి ఉన్న గౌరవం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. టెస్టులు, వన్డేలు లేదా టీ20లు.. ఫార్మాట్ ఏదైనా కోహ్లీ తనదైన ముద్ర వేస్తూనే ఉంటాడని సిద్ధూ విశ్వాసం వ్యక్తం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం