Whatsapp: కేవలం 60 సెకన్లే.. వాట్సప్‌లో ఈ ఒక్కటి ఆన్ చేస్తే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.. చాలామందికి తెలియని ఫీచర్
ఈ రోజుల్లో ప్రతీఒక్కరీ ఫోన్లలో వాట్సప్ అనేది తప్పనిసరి. వాట్సప్‌లో మన వ్యక్తిగత విషయాలు, బ్యాంకింగ్ వివరాలు లాంటివి ఎన్నో ఉంటాయి. ఇవి పక్కవారి చేతుల్లోకి వెళితే మీకు ఇబ్బందే. సెక్యూరిటీ కోసం వాట్సప్‌లో అనేక ఫీచర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

వాట్సప్‌లో మన చాట్‌లతో పాటు బ్యాంకింగ్ డీటైల్స్, ఫొటోలు లేదా వీడియోలు లాంటి వ్యక్తిగత వివరాలను భద్రపర్చుకుంటాం. వాట్సప్ ఎవరైనా హ్యాక్ చేసినా లేదా మీ ఫోన్ తీసుకుని ఎవరైనా చూసినా మీ విషయాన్నీ బయటపడే అవకాశముంది. అందుకే వాట్సప్‌ను ఎవరూ ఓపెన్ చేయకుండా సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం వాట్సప్ అనేక భద్రతా ఫీచర్లను తీసుకొచ్చింది. మీ వాట్సప్‌ను ఎవ్వరూ ఓపెన్ చేయకుండా టూ స్టెప్ ఐడెంటిఫికేషన్, ఆరు అంకెల పిన్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఎలా సెట్ చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండిలా..
-వాట్సప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి
-అకౌంట్ అనే ఆప్షన్‌ను ఎంచుకుంది టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయండి
-ఆరు అంకెల పిన్‌ను ఎంటర్ చేయండి
-ఇమెయిల్ ఐడీని అందించండి
-మెయిల్ ఐడీకి వచ్చే పిన్ నెంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
ఒకవేళ ఈ ఆప్షన్ ఆఫ్ చేయాలంటే..
-వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి
-అకౌంట్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-టూ స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్‌కు ఎంచుకుని డిసేబుల్ చేయండి
పిన్‌ను మార్చుకోవాలంటే..
-వాట్సప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి
-అకౌంట్ అనే ఆప్షన్‌ను ఎంచుకుని టూ స్టెప్ వెరిఫికేషన్‌లోకి వెళ్లండి
-పిన్ మార్పు అనే ఆప్షన్‌కు ఎంచుకుని కొత్త ఆరు అంకెల పిన్ ఎంటర్ చేయండి
