రోహిత్‌పై నిఘా.. కోవర్ట్‌తో గంభీర్ కన్నింగ్ ప్లాన్.. కట్‌చేస్తే.. లైవ్‌లోనే దూల తీర్చిన హిట్‌మ్యాన్
Rohit Sharma’s Masterclass in Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా సెంచరీతో రాణించడం గమనార్హం. తమను పక్కన పెట్టడం అంత సులువు కాదని ఈ ఇద్దరు దిగ్గజాలు నిరూపిస్తున్నారు. మరి గంభీర్ తన వ్యూహాలను మార్చుకుంటారా లేదా అనేది రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌లో తేలనుంది.

Gautam Gambhir vs Rohti Sharma: భారత క్రికెట్‌లో ప్రస్తుతం ‘స్టార్ కల్చర్’ వర్సెస్ ‘సిస్టమ్’ మధ్య నడుస్తున్న పోరు ముదిరి పాకాన పడింది. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు తోడు, తాజా పరిణామాలు క్రికెట్ వర్గాల్లో వేడిని పెంచుతున్నాయి. జైపూర్ వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన బ్యాట్‌తో గంభీర్‌కు గట్టి సమాధానం ఇచ్చాడని అంటున్నారు.
రోహిత్ శర్మ వీరవిహారం..
చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగిన రోహిత్ శర్మ, ముంబై తరపున సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో పాత ‘హిట్‌మ్యాన్’ను గుర్తుచేశారు. కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. ఇందులో 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ ఆట తీరు చూస్తుంటే, ఆయన ఇంకా ఫామ్ కోల్పోలేదని, జట్టులో ఆయన స్థానాన్ని ప్రశ్నించే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లు అనిపించింది.
గౌతమ్ గంభీర్‌పై అభిమానుల ఫైర్..
రోహిత్ సెంచరీ మార్కును అందుకున్న సమయంలో జైపూర్ స్టేడియంలోని అభిమానులు గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని నినాదాలు చేశారు. “గంభీర్ దేఖ్ రహా హై నా రోహిత్ కా జల్వా?” (గంభీర్.. రోహిత్ సత్తా చూస్తున్నావా?) అంటూ స్టేడియం మారుమోగిపోయింది. గంభీర్, సెలెక్టర్లు సీనియర్లపై తీసుకుంటున్న కఠిన నిర్ణయాల పట్ల అభిమానులు ఎంత అసంతృప్తిగా ఉన్నారో ఈ నినాదాలు స్పష్టం చేస్తున్నాయి.
సెలెక్టర్‌తో నిఘా..
ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బీసీసీఐ జాతీయ సెలెక్టర్ ఆర్.పి. సింగ్ మైదానంలోనే ఉండి రోహిత్ ఆటను నిశితంగా గమనించడం చర్చనీయాంశమైంది. గంభీర్ పంపిన ‘ప్రతినిధి’గా ఆర్.పి. సింగ్ అక్కడికి వచ్చారని, రోహిత్ ఫిట్‌నెస్, ఫామ్‌ను పరిశీలించేందుకే ఆయనను పంపారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలని బోర్డు నిబంధన పెట్టడంతో, ప్రతి కదలికపై సెలెక్టర్లు నిఘా పెట్టారు.
వివాదానికి నేపథ్యం..
గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో గంభీర్ వ్యూహాలపై విమర్శలు వచ్చాయి. మరోవైపు, సీనియర్లను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారం అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది.
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా సెంచరీతో రాణించడం గమనార్హం. తమను పక్కన పెట్టడం అంత సులువు కాదని ఈ ఇద్దరు దిగ్గజాలు నిరూపిస్తున్నారు. మరి గంభీర్ తన వ్యూహాలను మార్చుకుంటారా లేదా అనేది రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌లో తేలనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




