కరోనా ఎఫెక్ట్: స్థానికున్ని కొట్టి చంపిన యువకులు
కరోనా వైరస్ వచ్చిందని అనుమానంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటుంటే.. కోవిడ్ టెస్ట్ చేపించుకోమన్నందుకు మరికొందరిని హత్య చేస్తున్నారు. తాజాగా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పేరుకు పేద రాష్ట్రమే అయినా.. అక్కడ ఒక్క కరోనా పాజిటివ్ కేసు..

కరోనా వైరస్ వచ్చిందని అనుమానంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటుంటే.. కోవిడ్ టెస్ట్ చేపించుకోమన్నందుకు మరికొందరిని హత్య చేస్తున్నారు. తాజాగా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పేరుకు పేద రాష్ట్రమే అయినా.. అక్కడ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే.. వేరే రాష్ట్రాలకు పనులకి వెళ్లి వచ్చిన నలుగురు కుర్రాళ్లు లాక్‌డౌన్ తర్వాత నానా తంటాలు పడి సొంతూరికి వచ్చారు. పోనీ వచ్చినవాళ్లు ఇంటికే పరిమితమయ్యారా అంటే అదీ లేదు. దొరికిందే టైమ్ అంటూ ఊరంతా తిరగడం మొదలు పెట్టారు. ఇది చూసిన కాశీ షా అనే 45 ఏళ్ల పెద్దాయన వారిని నిలదీశాడు.
లాక్‌డౌన్ టైమ్‌లో మీరు ఇంట్లో ఉండకుండా బయట ఎందుకు తిరుగుతున్నారంటూ ప్రశ్నించాడు. మీరు ఎక్కడి నుంచో వచ్చి.. ఇప్పుడు ఆ కరోనాను ఇక్కడి ప్రజలకు అంటిస్తారా? అది చాలా ప్రమాదం. కాబట్టి మీరు నేరుగా ఇళ్లలోనే ఉండండి అంటూ గట్టిగా అరిచేసరికి.. చుట్టుప్రక్కల ఇళ్లల్లోంచి జనం గబగబా బయటకు వచ్చేశారు. దీంతో యువకుల కోపం కట్టలు తెచ్చుకుంది. వెంటనే అక్కడ ఉన్న కర్రలతో తీవ్రంగా ఆ 45 ఏళ్ల వ్యక్తిని చితకబాది.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇది చూసిన జనం అప్పటికే ఆంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. వెటనే దెబ్బలతో పడి ఉన్న కాశీ షాను కమ్యునిటీ హెల్త్ కేర్ సెంటర్‌కి తీసుకెళ్లారు. అప్పటికే చాలా రక్తం పోవడంతో అతను చనిపోయాడు. ఈ విషయం కాస్తా పోలీసుల వరకూ చేరడంతో కేసు నమోదు చేసి.. విచరాణ చేస్తున్నారు. ఇలా జార్ఖండ్‌లో కరోనా లేకపోయినా.. కరోనా పేరుతో ఓ మరణం సంభవించడం విషాదకరం.
ఇవి కూడా చదవండి:
కరోనా దెబ్బ.. మోదీ సర్కార్ భారీ అప్పు
లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు
కరోనా వైరస్: ప్రపంచంలో టాప్ 10 హై రిస్క్ అండ్ సేఫ్ కంట్రీస్ ఇవే!
వైన్స్ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్
క్రికెటర్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
భారత్‌లో ఒక్క రోజులోనే 45కి చేరిన మృతుల సంఖ్య
సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..