రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా?
సీనియర్ నటీమణి రమా ప్రభ గురించి తెలుగు ఆడియెన్స కు పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గానూ నటించిన ఈ అందాల తార ఆ తర్వాత లేడీ కమెడియన్ గా తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ నటీనటులతో కలిసి నటించిన ఘనత రమా ప్రభ సొంతం. ఇక శరత్ బాబుతో పెళ్ళి, విడాకులు రమా ప్రభ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. ఆ మధ్యన ఈ సీనియర్ నటి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై పలు రకాల పుకార్లు తెర మీదకు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలేనని తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా తన సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటోందీ సీనియర్ నటి.చెల్లెలి కూతురిని దత్తత తీసుకుని, పెంచి, పెళ్లి చేసి..ఇక రాజేంద్ర ప్రసాద్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ సపోర్టింగ్ రోల్స్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాడు.
ఈ మధ్యన వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు నట కిరిటీ. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్, రమా ప్రభల మధ్య ఉన్న బంధుత్వం గురించి చాలా మందికి తెలియదు. రమా ప్రభకు వరుసకు అల్లుడు అవుతాడు రాజేంద్ర ప్రసాద్. అసలు పిల్లలే లేని రమా ప్రభాకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడు ఎలా అయ్యాడని అనుకోవచ్చు. రమా ప్రభ తన చెల్లెలి కూతురిని దత్తత తీసుకుంది. తనే పెంచి పెద్దది చేసింది. ఆ తర్వాత తనే దగ్గరుండి రాజేంద్ర ప్రసాద్ తో తన కూతురి పెళ్లి కూడా చేసింది. అలా రమా ప్రభకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడయ్యాడు. దగ్గరి బంధుత్వం ఉండబట్టే తరచూ హైదరాబాద్ లోని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తుంటుంది రమా ప్రభ.ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అప్పుడప్పుడు రమా ప్రభ ఇంటికి వెళుతుంటాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా రమాప్రభ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో చూడవచ్చు.‘రమా ప్రభ ప్రయాణం’ పేరుతో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలను అప్ లోడ్ చేస్తోంది . వీటికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
మరిన్ని వీడియోలు :
స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. ఇప్పుడు ‘ఎంపురాన్’ సినిమా పరిస్థితి దారుణం
వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
