Hyderabad: ఇళ్లు ఊడుస్తుండగా కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా..
పాములు ఇళ్లలోకి ప్రవేశించి బూట్లలో, వాహనాల్లో చొరబడిన వీడియోలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. ఆ వీడియోలు చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది చిన్న పిల్లల స్కూల్ బ్యాగులో పాములు దూరడం ఎప్పుడైనా చూశారా ? తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో వెలుగుచూసింది.
హైదరాబాద్ నగర శివారులోని ఔషపూర్ వద్ద నాగు పాము బ్యాగులో దూరిన ఘటన కలకలం సృష్టించింది. తొమ్మిదో తరగతి చదువుతున్న లక్ష్మణ్ అనే బాలుడి స్కూల్ బ్యాగులో అనూహ్య రీతిలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఔషపూర్‌లో నివాసం ఉంటున్న రాము-స్వరూప దంపతులకు లక్ష్మణ్ అనే కుమారుడు ఉన్నాడు. స్థానికంగా ఉన్న పాఠశాలలో అతను తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం, సోమవారం సెలవులు కావడంతో తన బ్యాగును ఇంట్లోని కిటికీ వద్ద ఉంచాడు. అయితే ఆ బాలుడి తల్లి స్వూరూప ఇల్లు ఊడుస్తుండగా బ్యాగ్ కదులుతూ కనిపించడంతో.. స్వరూప అవాక్కయింది. భయంతో చుట్టుపక్కల వారిని పిలిచి బ్యాగు తెరిచే ప్రయత్నం చేసింది. ఇంతలో బ్యాగులో నుండి నాగు పాము ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు ఆ పామును చంపేశారు. స్కూల్ బ్యాగ్‌లో నుంచి పాము బయటికి రావటంతో అందరూ కంగుతిన్నారు. స్కూల్ లేకపోవడంతో బాలుడికి పెను ప్రమాదం తప్పిందని చర్చించుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

