తులసి మొక్కపై ఏ రంగు చీమలు కనిపిస్తే శుభప్రదం అంటే...

తులసి మొక్కపై ఏ రంగు చీమలు కనిపిస్తే శుభప్రదం అంటే... 

31 March 2025

image

Pic credit-Canva, META AI

TV9 Telugu

హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. హిందూ పురాణ గ్రంథాల ప్రకారం తులసిని పూజిస్తారు. తులసి మొక్కలేని హిందువుల ఇల్లు ఉండదు.

హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. హిందూ పురాణ గ్రంథాల ప్రకారం తులసిని పూజిస్తారు. తులసి మొక్కలేని హిందువుల ఇల్లు ఉండదు.

హిందూ మతం ప్రకారం లక్ష్మీ దేవి తులసి చెట్టులో నివసిస్తుంది. తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. ప్రతిరోజూ తులసి మొక్కని పూజించే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది.

హిందూ మతం ప్రకారం లక్ష్మీ దేవి తులసి చెట్టులో నివసిస్తుంది. తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. ప్రతిరోజూ తులసి మొక్కని పూజించే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది.

తులసి మొక్క ఎండిపోయిన ఇంట్లో, ప్రతికూల శక్తి  ఉంటుంది. తులసి మొక్కలపై కొన్నిసార్లు చీమలు కనిపిస్తాయి. ఇది దేనికి సంకేతం అని మీకు తెలుసా?

తులసి మొక్క ఎండిపోయిన ఇంట్లో, ప్రతికూల శక్తి  ఉంటుంది. తులసి మొక్కలపై కొన్నిసార్లు చీమలు కనిపిస్తాయి. ఇది దేనికి సంకేతం అని మీకు తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్కపై నల్ల చీమలు ఉండటం అశుభమని భావిస్తారు. అంతేకాదు తులసి మొక్కపై నల్ల చీమలు కనిపించడం ఆర్థిక సంక్షోభానికి సంకేతం.

ఇంట్లో తులసి మొక్కపై నల్ల చీమలు కనిపిస్తే, అది శని, రాహువు స్థానాలకు సంబంధించిన సమస్యలను సూచిస్తుంది. దీని ఫలితంగా జీవితంలో ప్రతికూల శక్తి ప్రభావం పడుతుంది.

మరోవైపు, తులసి చెట్టుపై ఎర్ర చీమలను చూడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇలా ఎర్ర చీమలు కనిపిస్తే డబ్బు సంపాదిస్తారని ఇంట్లో డబ్బుకి కొరత ఉందని సూచిస్తుంది.

తులసి మొక్క దగ్గర చీమలు చనిపోతే.. అది కూడా అశుభంగా పరిగణించబడుతుంది. దీనివల్ల ఇంట్లో  అనేక సమస్యలు రానున్నాయని ముందస్తు సూచన అని చాలా మంది నమ్ముతారు.

గమనిక - ఈ నివేదికలో చెప్పిన విషయాలు జ్యోతిషశాస్త్రం, హిందువుల గ్రంథాల నుంచి తీసుకోబడిన సమాచారం. ఈ విషయాన్ని టీవీ9 తెలుగు ద్రువీకరిమ్చడం లేదు. ఎటువంటి బాధ్యత వహించదు.