ఉప్పు ఆరోగ్యానికి ముప్పే.. రోజుకి ఎంత ఉప్పు తినాలో తెలుసా
29 March 2025
Pic credit-Pexel
TV9 Telugu
ఎంత మంచి వంటకానికైనా ఎన్ని రకాల మసాలాలు వేసినా.. అందులో ఉప్పు కొంచెం తక్కువైనా లేదా ఎక్కువైనా ఆ వంటకం రుచి డిఫరెంట్ గా ఉంటుంది.
ప్రతి ఒక్కరూ రోజు తినే ఆహారంలో ఉప్పు ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఎంత ఉప్పు తినాలో తెలుసా? దీని గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
ఉప్పు మన శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఇది శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఉప్పు వివిధ లక్షణాలను కలిగి ఉంటుంది.
శరీర నరాలు, కండరాలు సరిగ్గా పనిచేయడానికి ఉప్పు అవసరం. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కొన్ని రోజులు ఉప్పు తినకపోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.
రోజుకు ఒక టీస్పూన్ ఉప్పు తింటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మూత్రపిండాల పనితీరులో సమస్యలు వస్తాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అదనంగా, గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, ఆస్టియోపోరోసిస్ లేదా ఎముకల నష్టం సంభవిస్తాయి.
ఈ వ్యాధులన్నింటితో పాటు, ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మెనియర్స్ వ్యాధి , మూత్రపిండాల వ్యాధి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అంతేకాదు ఉప్పుని రోజుకు 2.3 గ్రాముల కంటే ఎక్కువగా తినడం వలన మెదడుకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదమూ ఉంది. పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.