28 March 2025
Pic credit-Pexel
TV9 Telugu
పెరుగు, బెల్లం రెండు శరీరానికి మేలు చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు సులభంగా తొలగిపోతాయి. అంతేకాదు శరీరానికి శక్తినిస్తాయి.
కాల్షియం, ప్రోటీన్ , రిబోఫ్లేవిన్ వంటి అంశాలు పెరుగులో కనిపిస్తాయి. అయితే బెల్లంలో ఐరన్, కాల్షియం, విటమిన్ సి లభిస్తాయి.
ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా ఒక గిన్నెడు పెరుగులో బెల్లం కలిపి తినడం వల్ల శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుందని పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ అంటున్నారు.
బెల్లంలో ఐరెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త పరిమాణాన్ని పెంచడం ద్వారా శరీర బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. పెరుగుతో కలిపి తింటే చాలా మేలు జరుగుతుంది.
బెల్లం పెరుగుతో కలిపి తినడం వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలు సులభంగా నయమవుతాయి.
మీరు చాలా కాలంగా బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే.. బెల్లం పెరుగుతో కలిపి తినండి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా మారుతుంది.
ఈ రెండిటిని కలిగి తినడం వలన వీటిలోని పోషకాలు కలిసి ఎముకలను బలోపేతం చేస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండూ కాల్షియం ఉన్న గొప్ప వనరులు