Best Electric Scooter: హోండా నుంచి 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రెండింటిలో ఏది ఉత్తమం..!
Best Electric Scooter: మీరు కూడా హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, అలాగే రెండింటిలో ఏది కొనాలో గందరగోళంగా ఉంటే, రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి. రెండు స్కూటర్ల మధ్య చాలా తేడా ఉంది. బడ్జెట్, డిజైన్, మైలేజీ పరంగా తేడాలున్నాయి..

2024 చివరిలో హోండా తన మొదటి 2 ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభమైంది. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి యాక్టివా-ఇ అనే ప్రసిద్ధ యాక్టివా బ్యాటరీ వెర్షన్, మరొకటి QC1 అనే పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్. మీరు కూడా హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, అలాగే రెండింటిలో ఏది కొనాలో గందరగోళంగా ఉంటే, రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి. రెండు స్కూటర్ల మధ్య చాలా తేడా ఉంది. బడ్జెట్, డిజైన్, మైలేజీ పరంగా తేడాలున్నాయి.
1. డిజైన్:
డిజైన్ విషయంలో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ఫ్రంట్ హ్యాండర్‌లో LED DRL కనిపిస్తుంది. డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు దిగువన డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. అయితే QC1 సాధారణ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. డిస్క్ బ్రేక్‌లు లేవు.
2. లక్షణాలు:
ఎలక్ట్రిక్ యాక్టివాలో 7-అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. దీనిలో నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలింగ్, మ్యూజిక్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. అయితే QC1 5-అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో బ్యాటరీ, పరిధి, వేగం మాత్రమే కనిపిస్తాయి.
3. బ్యాటరీ:
రెండు స్కూటర్ల బ్యాటరీ ప్యాక్‌లో పెద్ద తేడా ఉంది. యాక్టివా ఎలక్ట్రిక్ మార్చుకునే బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అయితే QC1 బ్యాటరీ ప్యాక్‌ను మార్చుకునే అవకాశం లేకుండా వస్తుంది. యాక్టివా ఎలక్ట్రిక్‌లో సీటు కింద స్టోరేజీ లేదు. QC1 26 లీటర్ల స్టోరేజీని అందిస్తుంది.
4. మైలేజీ, ఛార్జింగ్:
రెండు స్కూటర్ల పరిధి విషయానికొస్తే యాక్టివా ఎలక్ట్రిక్ 2 బ్యాటరీలతో 102 కి.మీ సింగిల్ ఛార్జ్ పరిధిని అందిస్తుంది. హోండా పవర్ స్టేషన్‌లో రూ. 2000 సబ్‌స్క్రిప్షన్‌తో వీటిని అపరిమితంగా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి కొన్ని నిమిషాలు పడుతుంది. మరోవైపు, QC1 80 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది.
5. వేగం, ధర:
ఇక స్పీడ్ విషయానికొస్తే QC1 గరిష్ట వేగం గంటకు 50 కి.మీ. వరకు ఉంటుంది. అదే యాక్టివా ఎలక్ట్రిక్ గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. వరకు ఉంటుంది. QC1 కొనడానికి మీరు రూ. 90 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. యాక్టివా ఎలక్ట్రిక్ కోసం మీరు కనీసం రూ. 1.17 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి