Passport Color: షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? భారత్‌లో ఎన్ని రకాల పాస్‌పోర్ట్‌లున్నాయి?
Passport Color: ఈ పాస్‌పోర్ట్ దగ్గర ఉంచుకున్న వారికి విదేశీ వలస విధానాలు కూడా సులభతరం అవుతాయి. ఈ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారికి అంతర్జాతీయ ప్రయాణానికి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు. షారుఖ్ ఖాన్ దౌత్యవేత్త లేదా సీనియర్ ప్రభుత్వ అధికారి కాదు. మరి అతను మెరూన్ పాస్‌పోర్ట్ ఎందుకు..

విదేశాలకు వెళ్ళేటప్పుడు పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఈ పాస్‌పోర్ట్ మీరు ఏ దేశ పౌరుడో గుర్తిస్తుంది. ఈ పాస్‌పోర్ట్ భారతీయ పౌరులకు పౌరసత్వ రుజువుగా ముఖ్యమైనది. మీరు భారతదేశం వదిలి వేరే దేశానికి వెళితే ఇది మీకు అవసరం. భారతీయులు సాధారణంగా ఉపయోగించే పాస్‌పోర్ట్ రంగు నీలం. నీలం రంగు పాస్‌పోర్ట్ కాకుండా భారతీయులు మరో రెండు రకాల పాస్‌పోర్ట్‌లను ఉపయోగిస్తున్నారు. బాలీవుడ్ ‘కింగ్’ షారుఖ్ ఖాన్ మెరూన్ పాస్‌పోర్ట్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే మరికొందరు తెల్ల పాస్‌పోర్ట్‌లను ఉపయోగిస్తున్నారు. మరి అందరు ఇలాంటి మెరూన్ పాస్‌పోర్ట్, తెల్ల పాస్ పోర్టులు పొందలేరు. అయితే షారుఖ్ ఖాన్ కు మెరూన్ రంగు పాస్‌పోర్ట్ ఎందుకు ఉంది? ఈ పాస్‌పోర్ట్‌ను ఎవరు ఉపయోగించవచ్చో మీకు తెలుసా?
సాధారణంగా చాలా మంది భారతీయులకు నీలి రంగు పాస్‌పోర్ట్‌లు ఇస్తారు. విదేశాలకు వెళ్ళేటప్పుడు ఈ పాస్‌పోర్ట్ చాలా ముఖ్యం. నీలిరంగు పాస్‌పోర్ట్ ఉపయోగించి మీరు పని, విద్య, ఆరోగ్యం, మొదలైన వివిధ ప్రయోజనాల కోసం అనుమతితో విదేశాలకు ప్రయాణించవచ్చు.
అయితే, కొంతమందికి నీలం రంగు పాస్‌పోర్ట్‌లకు బదులుగా తెల్లటి పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తుంటారు. ప్రభుత్వ పనులపై విదేశాలకు వెళ్లే వారికి దీనిని ఇస్తారు. ఎవరి దగ్గరైనా ఈ పాస్‌పోర్ట్ ఉంటే వారు ప్రభుత్వ అధికారి కావచ్చునని అర్థం. సాధారణంగా ప్రభుత్వ పనుల కోసం తరచుగా విదేశాలకు వెళ్లాల్సిన వారికి ఈ పాస్‌పోర్ట్ లభిస్తుంది. మళ్ళీ కింగ్ ఖాన్ లాంటి కొంతమంది ప్రత్యేక వ్యక్తులు మెరూన్ రంగు పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నారు. నిజానికి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మెరూన్ పాస్‌పోర్ట్‌లను దౌత్యవేత్తలు లేదా సీనియర్ అధికారులకు ఇస్తారు. ఈ పాస్‌పోర్ట్‌ను భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది.
ఈ పాస్‌పోర్ట్ దగ్గర ఉంచుకున్న వారికి విదేశీ వలస విధానాలు కూడా సులభతరం అవుతాయి. ఈ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారికి అంతర్జాతీయ ప్రయాణానికి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు. షారుఖ్ ఖాన్ దౌత్యవేత్త లేదా సీనియర్ ప్రభుత్వ అధికారి కాదు. మరి అతను మెరూన్ పాస్‌పోర్ట్ ఎందుకు ఉపయోగిస్తున్నాడు?
ఇది కూడా చదవండి: Mukesh Ambani House: అంబానీ ఇంటి విద్యుత్ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే మతిపోతుంది!
నటనా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ పేర్లలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఆయన నటన ఒక్క దేశానికే పరిమితం కాదు. ప్రపంచం మొత్తం పాకింది. ఆయన కీర్తి, ఆదరణ, భారతీయ సినిమాకు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ఈ ప్రత్యేక పాస్‌పోర్ట్‌తో సత్కరించింది. అయితే, ఇండియా.కామ్ నివేదిక ప్రకారం.. షారుఖ్ ఖాన్ లేదా అతని బృందం నుండి అతను మెరూన్ రంగు పాస్‌పోర్ట్ ఉపయోగిస్తున్నాడా లేదా అనే దానిపై ఎటువంటి నిర్ధారణ లేదు. అయితే కింగ్ ఖాన్ వద్ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోసం గోల్డెన్ వీసా ఉంది. దీనివల్ల షారుఖ్ ఆ దేశంలో ఎక్కువ కాలం ఉండి చదువుకోవచ్చు లేదా అవసరమైతే జీవనోపాధి పొందవచ్చు. అది కూడా ప్రభుత్వ స్పాన్సర్‌షిప్ లేకుండానే.
ఇది కూడా చదవండి: New Rules: యూపీఐ, ఆదాయపు పన్ను నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి